Home » Tag » flood
దేశవ్యాప్తంగా వానలు అతలాకుతలం చేస్తున్నాయ్. నాన్‌స్టాప్ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయ్. గుజరాత్లో వానలు దంచికొడుతున్నాయ్.
విజయవాడ వరదలు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. వరద తగ్గుతున్నా కొద్దీ.. శవాలు బయటపడుతున్నాయ్. వరదలకు బలయిన వారి సంఖ్య ఇప్పటికే 40దాటింది. సహాయచర్యలు పూర్తయ్యే వరకు ఆ నంబర్ ఎంతకు పెరుగుతుందో అనే ఆలోచనే.. ఇప్పుడు ప్రతీ ఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
ప్రశాంతతకు నిలయమైన తెలుగురాష్టాలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నాయి. మనిషి తన స్వార్ధం కోసమే చేసిన దుర్మార్గపు పనుల వల్ల రెండు రాష్ట్రాల్లోని కొన్ని కీలక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు మణిహారంగా నిలిచే బెజవాడ.. ఒరుసుకుపోయిన పసిపాపలా అయింది.
తూర్పు ఆఫ్రికా (East Africa) దేశాలైన టాంజానియా(Tanzania), కెన్యా (Kenya), బురుండీల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని శక్తిమంత మైన పసిఫిక్ తుపాను అతలాకుతలం చేసింది. ఈ తుపాను కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని అనేక నగరాల్లో కుంభవృష్టి కురిసింది. ఈ వర్షాలకు నదులు పొంగి పొర్లుతుండటంతో వరదలు పోటెత్తాయి.
డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలం. వరదల ధాటికి వేల సంఖ్యలో ఇళ్లు తుడిచి పెట్టుకుపోవడంతో ఎక్కడ చూసినా శవాల దిబ్బలు. ముఖ్యంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో అపార్టుమెంట్లు, వీధుల్లో గుట్టలుగుట్టలుగా మృతదేహాలు. ఇప్పటికే 11,000 మృతదేహాలను గుర్తించారు.
టమాట కొనలేక.. కూరలు రుచిలేక.. కొనే ధైర్యం లేక.. మధ్య తరగతి జనాలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. టమాటా ధరలు మోతెక్కిపోతుంటే.. ఇప్పుడు మరో ప్రమాదం ముంచుకు రాబోతోంది. ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్.