Home » Tag » Food and Public Distribution Piyush Goyal Ration
రేషన్ కార్డు మనకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం, పప్పు, తదితర సరుకులు పంపిణి చేస్తుంది. ఈ కార్డు కావాలంటే మీ సేవ ద్వారా వెళ్లి తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రభుత్వ సంబంధించిన సైట్ లో నమోదు చేయాలి. ఇది వరకు చాలా మంది ఈ ప్రక్రియను విజయవంతం చేసుకున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ షాప్ కు వెళ్లి ఇంటికి కావలసిన సరుకులు ప్రభుత్వం ఆద్వర్యంలో తక్కువ ధరలో.. ప్రభుత్వ పథకాల లో ఉచితంగానో మనం ఇంత వరకు తెచ్చుకున్నాం.. మనకు ఇంత వరకు మాత్రమే తెలుసు.. ఎందుకంటే రేషన్ కార్డుతో మనకు అంతకు మించి ఎం పని ఉండదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ రేషన్ షాప్ చూసినా పిల్లజల్లతో బారులు తీరిన ప్రజలు.. ఎందుకని అడిగితే రేషన్ కార్డులు ఉన్నవాళ్లు కేవైసీ చేసుకోవాలి.. లేదంటే రేషన్ కార్డు రద్దు చేస్తారు. అనే మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది.