Home » Tag » Food Crisis
చైనా గడిచిన కొన్నేళ్లుగా ఏదో ఒక కారణంగానో లేక సమస్యతో వార్తల్లోకెక్కుతోంది. ఒకప్పుడు టెక్నాలజీ పరంగా నిలిస్తే మన్నటి వరకూ కోవిడ్ తో ప్రళయం సృష్టించింది. గతంలో వృద్ధ జనాభాతో విలవిలలాడిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు వర్షాలతో వణికిపోతోంది. భారీ వర్షాలతో పంటలన్నీ నీటమునిగాయి. దీని ప్రభావం ఆహార ఉత్పత్తులపై పడితే.. అన్నమో రామ చంద్రా అని పక్కదేశాల వైపు ఆకలి చూపులు చూడాల్సి వస్తుందా.. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రపంచ వ్యాప్తంగా మెజార్టీ దేశాలకు రైస్‌ను ఎగుమతి చేసే భారత్.. ఈ మధ్య రైస్ ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్ నుంచి బియ్యం సరఫరా ఆగిపోతే చాలా దేశాల్లో ప్రజల జీవితాలు తలకిందులైపోతాయి.