Home » Tag » Free bus ride
తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నాగోల్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఈ పథకానికి వ్యతిరకంగా పిటిషన్ దాఖలు చేశారు. బస్సులలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించడం వివక్ష కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఉచిత బస్సు ప్రయాణాన్ని యూజ్ చేసుకునేందుకు.. మహిళలు తమ వెంట ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ను తీసుకురావాలని అధికారులు సూచించారు. ఐతే ఇప్పుడు ఇదే విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ వేదికగా కొన్ని విషయాలు పంచుకున్నారు.
మహిళలు కొన్ని రూల్స్ పాటించాల్సిందే అని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. బస్సుల్లో ప్రయాణించాలంటే ఇకపై ఒరిజినల్ గుర్తింపు కార్డుల్ని మాత్రమే చూపించాలని సజ్జనార్ తెలిపారు. జిరాక్స్ కాపీలు అనుమతించబోమన్నారు.
వయస్సుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్ ఉచితంగా ప్రయాణించడానికి తెలంగాణ సర్కార్ అవకాశం కల్పిస్తోంది. అయితే మహిళంతా ప్రయాణించడానికి వీలైనన్ని బస్సులు మన రాష్ట్రంలో ఉన్నాయా..? అసలు కర్ణాటకలో ఈ స్కీమ్ ఎలా అమలవుతోంది..?
శక్తి స్కీం వల్ల అత్యధికంగా నష్టపోతోంది ఆటోవాలాలే. ప్రస్తుతం బెంగళూరులో చాలా మంది ఆటో డ్రైవర్లకు ఆదాయం తగ్గిపోయింది. కొంతమంది కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపడా డబ్బులు కూడా సంపాదించుకోవడం లేదు.