Home » Tag » Free Travel
హైదరాబాద్లో మెట్రో లేని రూట్లలో ప్రతి 10 నిమిషాలకో బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
గ్యారంటీ పథకాలు.. కాదు కాదు ఉచితాల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు. ఒకరకంగా జగన్కు అధికార పీఠం దగ్గర చేసింది కూడా అలాంటి గ్యారంటీలే. ఉచిత పథకాలే రికార్డు స్థాయి విజయంతో జగన్ను సీఎం చేశాయ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ను అధికారాన్ని దగ్గర చేసింది కూడా.. అలాంటి ఉచిత గ్యారంటీలే ! కాంగ్రెస్ విజయం నుంచి తెలుసుకున్నారో.. ముందే అనుకున్నారో కానీ.. ఆరు గ్యారంటీలను పోలిన గ్యారంటీలను టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ జనాల మీద గుప్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని.. ఇప్పటికే సభల్లో చంద్రబాబు హామీ ఇస్తున్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మగాళ్ళకి తిప్పలు తెచ్చిపెట్టింది. ప్రతి బస్సులో 80శాతానికి పైగా సీట్లను మహిళలే ఆక్రమిస్తున్నారు. డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనుక్కున్న మేము.. నిలబడే ప్రయాణించాలా అని మగాళ్ళు గగ్గోలు పెడుతున్నారు.
తెలంగాణలో అధికార పీఠంపై కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టిన పథకాల్లో మహాలక్ష్మి పథకం ముఖ్యమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి తెలంగాణలో మహిళలంతా ఫ్రీగా బస్లలో ప్రయాణిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బస్ ప్రయాణం ఫ్రీ అవ్వడంతో చాలా మంది మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారు. హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో చాలా వరకూ ఆటోలకు మహిళల నుంచే ఉపాధి వస్తుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వరుసగా అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసింది. డిసెంబర్ 9 నుంచి తెలంగాణలో మహిళలు ఆర్టీసీ బస్లలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో మహాలక్ష్మీ పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటించింది. అన్నట్లుగానే ఆ పథకం కూడా అమలు చేస్తుంది అధికార పార్టీ కాంగ్రస్ సర్కర్. కాగా గురువారం రాత్రి 12 గంటల నుంచి రాష్ట్ర అంతటా.. జీరో టికెటింగ్ విధానం అమ్లలోకి వచ్చింది. శుక్రవారం నుంచి జీరో టికెట్లును జారీ చేయాలని ఆర్టీసీ అధికారులకు ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు కూడా జారీ చేశారు.
తెలంగాణలో త్వరలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం రాబోతోంది. దీనిపై ఇప్పటికే మహిళలంతా ఎదురు చూస్తుండగా.. మీమ్స్, జోకులు కూడా సోషల్ మీడియాలో పేలుతున్నాయి. సరే.. ఈ పథకాన్ని రాష్ట్రంలో ఎలా అమలు చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలను ఎలా ఖరారు చేయబోతోంది అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే ఈ లోగా ప్రభుత్వం అడిగితే రెడీగా నివేదిక ఇవ్వడానికి తెలంగాణ ఆర్టీసీ ప్రిపేర్ అవుతోంది. నలుగురు అధికారుల బృందం బెంగళూరుకు వెళ్ళి.. కర్ణాటక రాష్ట్రంలో ఫ్రీ టికెట్ సిస్టమ్ ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకుంటోంది.