Home » Tag » Freedom
తాను ఆడిన కెప్టెన్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ సారథని ఇషాంత్ శర్మ ప్రశంసించాడు. అతని పర్యవేక్షణలోనే తాను అత్యుత్తమ బౌలింగ్ చేశానని గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ సారథ్యంలో భారత పేసర్లు దుమ్మురేపారని తెలిపాడు. పేస్ బౌలర్లకు విరాట్ కోహ్లీ అండగా నిలిచేవాడని చెప్పాడు.
ఆర్టికల్ 370 రద్దు అయితే ఏమవుతుందని ప్రశ్నించిన వాళ్లందరికీ.. ఈ అమ్మాయి బైక్ రైడే ఆన్సర్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ఎలా మారాయ్.. అక్కడి జనాలు ఎలాంటి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారనే దానికి ఈ యువతి ఆనందమే సాక్ష్యం. కశ్మీర్లో శాంతి నెలకొల్పడమే లక్ష్యం అంటూ.. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ రద్దు తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్.
బంధం అనేది కలిసుంటేనే కాదు. విడివిడిగా ఉంటూనే అందరితో కలివిడిగా బ్రతికినా అది అందమైన బంధమే అవుతుంది. ఇలాంటి మాటలు నేను చెబుతున్నది కాదు. తమిళనాడు, ముంబై, అమెరికాలోని స్వదేశీ, విదేశీ గృహిణిలు ప్రయోగాత్మకంగా నిరూపించిన విషయాన్ని మీకు ఇలా ఒక్క మాటలో తెలుపుతున్నాను. గృహిణిలు అంటున్నారు, విడివిడిగా అంటున్నారు ఇంతకూ విషయం ఏంటో అనుకొని కంగారు పడకండి. విడాకుల వేడుక గురించి చెప్పే వివరం ఇది. తాజాగా మన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన విడాకుల తీర్పుకు వీరు ఎప్పుడో జీవం పోసారు. ఇప్పుడు హాయిగా స్వేచ్ఛాయుత జీవనాన్ని జీవిస్తున్నారు. వీరు ఎవరు, ఎందుకిలా చేశారు అనే మరిన్ని ఆసక్తికరమైన అంశాలను సృషిస్తూ ముందుకు సాగుదాం.
శ్రమజీవుల కష్టానికి గుర్తింపు తీసుకొచ్చిన పార్టీగా.. హక్కుల కోసం అసువులు బాసిన పతాకగా.. కమ్యూనిజానికి గుర్తింపు ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదాన్ని, అరుణ పతాకాన్ని అందించి ఉద్యమాలతో సామాన్యులకు కమ్యూనిజం సాధించిపెట్టిన విజయాలు, ప్రయోజనాలు ఎన్నో ! ఐతే ఇదంతా గతం.. ఎర్రజెండాలు ఇప్పుడు వెలిసిపోతున్నాయ్. మారిన రాజకీయ ఆటలో కామ్రేడ్లు కష్టపడలేకపోతున్నారు. దిక్కులు చూస్తున్నారు.. అడుగులు మారుస్తున్నారు. కమ్యూనిజానికి అర్థం మారుస్తున్నారు.
అక్కడో పెళ్లి జరుగుతోంది. వధువు..వరుడు.. చూడముచ్చని జంట. బంధుమిత్రుల కోలాహలం మధ్య వైభవంగా పెళ్లివేడుక నిర్వహించారు కుటుంబ సభ్యులు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అతిథులు కూడా ఆశీర్వదించి బెస్ట్ విషెస్ చెప్పారు. ఏడడుగులతో ఆ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌ను ప్రకటించింది. అందులో ఫిన్లాండ్ అగ్రభాగాన నిలిచింది. మరి మన ర్యాంక్ ఎంతో తెలుసా..? 126. మొత్తం 150 దేశాల్లో మన స్థానం అది. మరి ఫిన్లాండ్లో ఉన్నదేంటి.. మన దగ్గర లేనిదేంటి..?
సాధారణంగా రిలేషన్ షిప్ అంటే చూసి ఉంటారు. అందులో లవ్ రిలేషన్, మ్యారేజ్ రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్, లివింగ్ రిలేషన్ అని చాలా రకాలుంటాయి. వీటన్నింటి గురించి వినిఉంటారు. కానీ వీటన్నింటికీ భిన్నంగా పాత సంప్రదాయానికి చెక్ పెడుతూ వచ్చేసింది వీకెండ్ రిలేషన్ షిప్. పాశ్చాత్య దేశాల్లో ఇది సరికొత్త ట్రెండ్. దీనిపై ఒక లుక్కేద్దాం పదండి.