Home » Tag » G Kishan Reddy
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి.. ఆ సౌండ్ ఢిల్లీ వరకు రీసౌండ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది తెలంగాణ బీజేపీ. 400 ప్లస్ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. తెలంగాణ మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గతంలో కంటే ఎక్కువ లోక్సభ స్థానాలను తెలంగాణలో గెలుచుకునేలా.. ఢిల్లీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు
ఇప్పటివరకు బీజేపీ 53 మంది అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించింది. మరో 66 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. అయితే, ఈ అంశం ఎక్కడిదాకా వచ్చిందో కూడా ఎవరికీ స్పష్టత లేదు.
తెలంగాణలో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించే విషయంలో మీన మేషాలు లెక్కింస్తోది. శనివారం 55 మందిలో కూడిన తొలిజాబితా విడుదల అవుతుందని అందరూ భావించారు. అయినప్పటికీ ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. దీనికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
119 మంది అభ్యర్థులకుగాను.. మొదటి జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించబోతుంది. అభ్యర్థుల ఎంపిక కోసం బీజేపీ కసరత్తు పూర్తి చేసింది. మొదటి విడత జాబితాపై ఒక స్పష్టతకు వచ్చింది. దీంతో ఈ నెల మూడో వారంలో తొలి జాబితా వస్తుంది.
గతంలో బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకించిక ఒక వర్గం.. ఇప్పుడు కిషన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా అలాగే వ్యతిరేకిస్తోంది. బండిని తొలగించిన తర్వాత కిషన్ రెడ్డితోనైనా కలిసి సాగాల్సింది. కానీ, ఇప్పటికీ పార్టీ మీద, తమ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు కొందరు నేతలు.
తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ దూకుడుగా ఉండేది. ఆ సమయంలో బీఆర్ఎస్కు ప్రధాన పోటీ బీజేపీనే అనే పరిస్థితి ఉండేది. అయితే, బండిపై ఈటల, కోమటిరెడ్డి వంటి నేతలు ఫిర్యాదు చేసి, ఆయనను పదవి నుంచి దింపేశారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలాగైనా సత్తా తన సత్తా చాటాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
కేంద్ర మంత్రి పదవి వద్దన్న బండి.. సాధారణ నేతగానే మిగిలిపోతారా..? ఇకపై ఆయన వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో బండి త్వరలోనే తన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పుడు బండికి కేంద్ర మంత్రి పదవి వస్తుందో.. రాదో.. కానీ, కీలకమైన పదవి మాత్రం కోల్పోయాడు. ఒకవేళ కేంద్ర మంత్రి పదవి వచ్చినా.. ఆ పదవి ఉండేది మరో తొమ్మిది నెలలు మాత్రమే. ఆ తర్వాత ఎలాగూ ప్రభుత్వం రద్దవుతుంది. ఇదంతా బండి స్వయంకృతాపరాధమే.
బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని.. కాస్త కష్టపడితే అధికారంలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనాలు వేశారు. కానీ అందరి అంచనాలను బీజేపీ నేతలే తలకిందులు చేశారు. సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అధికారం సంగతి పక్కన పెడితే ప్రతిపక్షంలో కూడా ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు బీజేపీ ఉంది.