Home » Tag » Gabba
గబ్బా టెస్ట్ టీమిండియాలో సంతోషంతో పాటు బాధను మిగిలిచింది. ఈ టెస్టులో ఓటమి అంచున ఉన్న భారత్ డ్రాగా నిలవగా మరోవైపు టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం టీమిండియా 260 పరుగులకు ఆలౌటైంది.
భారత క్రికెట్ లో గొప్ప ఆటగాడి శకం ముగిసింది. వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్రిస్బేన్లో మూడో టెస్ట్ ముగిసిన తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పక్కనే ఉన్న కోహ్లీని హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు.
గబ్బా టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. బౌలర్లు విఫలమైన వేళ ఆస్ట్రేలియా భారీస్కోర్ సాధించగా... అటు బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. అంచనాలు పెట్టుకున్న టాపార్డర్ లో రాహుల్ తప్పిస్తే మిగిలినవారంతా నిరాశపరిచారు.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు మహిళా కామెంటేటర్ క్షమాపణలు చెప్పింది. తాను పొరపాటుగా మాట్లాడానని, క్షమించాలని కోరింది. గబ్బా వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగుతోంది. తొలి టెస్టులో భారత్ గెలిస్తే... తర్వాత పుంజుకున్న కంగారూలు అడిలైడ్ లో రివేంజ్ తీర్చుకున్నారు. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పెర్త్ వేదికగా వచ్చే ఏడాది నవంబరు 21 నుంచి ఇరుజట్ల మధ్య ఈ మెగా సిరీస్ మొదలుకానుంది.