Home » Tag » Gaddam Prasad Kumar
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణలో మూడో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ముందుగా ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ ఒవైసీ మిగతా సభ్యులతో ప్రమాణం చేయనున్నారు. నేడు ఎమ్మెల్యేలుగా కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే. అది కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. గురువారం ప్రొటెం స్పీకర్ నుంచి అధికారిక ప్రకటన ఉంటుంది.
తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ నామినేషన్లు స్వీకరణ జరగనుంది. మూడో అసెంబ్లీ స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. నేడు గడ్డం ప్రసాద్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ల గడవు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ మధ్యాహ్నం 12. గంటల తర్వాత తన నామినేషన్ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు అందజేస్తారు.
15నాడు అసెంబ్లీ కొత్త స్పీకర్ను ఎన్నికుంటారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ను స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ తరపున ఆయన నామినేషన్ వేయబోతున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థిని నిలబెడతాయా.. పోటీకి పెట్టే ఆలోచన బీఆర్ఎస్ చేస్తుందా.. చేస్తే గెలుస్తారా..?
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రసాద్ కుమార్. ఈయన స్వగ్రామం తాండూర్ మండలం బెల్కటూర్. గతంలో టెక్స్టైల్ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రసాద్ కుమార్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు.. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బి. సంజీవరావుపై గెలిచారు.