Home » Tag » Gajuwaka
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గాజువాక నియోజకవర్గం హాట్ ఫేవరెట్. వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు ఇద్దరికీ హోం గ్రౌండ్. ఒకరు మంత్రైతే... మరొకరు సీనియర్ నేత. అభివృద్ధి -సింపథీ-లోకల్ ఈ మూడు అంశాల చుట్టూ ఎన్నికలు తిరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి ఆసక్తి.. పిఠాపురం నియోజకవర్గం మీదే ! పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల ఇంట్రస్ట్ అంతా ఇక్కడే కనిపిస్తోంది.
చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఒక ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. అయితే, రాయి చంద్రబాబు పక్కకు పడటంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రాయి విసిరిన ఆగంతకుడి కోసం గాలింపు చేపట్టారు.
గాజువాక (Gajuwaka) వైసీపీ (YCP) రాజకీయం (politics) రంగు మారుతోంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి...సమన్వయకర్త చందు యాదవ్ మధ్య వర్గపోరు బజారు కెక్కింది. తాజా పరిణామాలతో వాతావరణం గందరగోళంగా మారుతోంది. సీటు ఫైట్ ముదిరి ఎమ్మెల్యే వెర్సెస్ కో - ఆర్డినేటర్ గ్రూపులుగా విడిపోయింది పార్టీ. ఇన్నాళ్ళు ఎమ్మెల్యే ను గురువుగా సంబోధించిన చందు యాదవ్ ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేయడం అధికార పార్టీని కలవరపరుస్తోంది.
విశాఖ జిల్లా గాజువాక వైసీపీ కోఆర్డినేటర్ తిప్పల దేవన్ రెడ్డి కూడా సోమవారం వైసీపీకి రాజీనామా చేశారు. ఒకేరోజు ఇద్దరు కీలక నేతలు పార్టీకి రాజీనామాలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. దేవన్ రెడ్డి.. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ లీడర్లలో ఒకరైన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి స్థిరంగా ఓ నియోజకవర్గం అంటూ ఏదీ లేదు. జగన్ ఎన్నిసార్లు పోటీ చేసినా.. పులివెందులలో గెలవడం గ్యారటీ. అలాగే చంద్రబాబుకి కుప్పం స్థిరమైన నియోజకవర్గంగా ఉంది. మరి పవన్ కల్యాణ్‌కి ఇలా ఓ నియోజకవర్గం ఎందుకు లేకుండా పోయింది.
వినాయక విగ్రహం విషయంలో విశాఖ వాసులు రికార్డు సృష్టించారు. 117 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణపయ్యను ప్రతిష్టించారు. దేశంలోనే అత్యంగ ఎత్తైన విగ్రహంగా రికార్డ్ నెలకొల్పారు. గాజువాకలో సుమారు 75 లక్షల రూపాయలు ఖర్చు చేసి దీనిని తయారు చేశారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈసారి కూడా విశాఖలోని గాజువాక నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. భీమవరంతోపాటు గాజువాకలో కూడా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేయకపోవచ్చని అంతా అనుకున్నారు.