Home » Tag » GAJWEL
కేసీఆర్ కనిపించడం లేదు.. ఆచూకీ చూపించిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును. ఇదీ గజ్వేల్‌లో వెలిసిన పోస్టర్లు. అక్కడ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. కేసీఆర్ పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని.. గజ్వేల్‌కు రావడం మానేశారని హైలైట్ చేస్తూ.. బీజేపీ నేతలు గజ్వేల్‌లో వినూత్న నిరసన చేపట్టారు. గజ్వేల్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి సొంత నియోజకవర్గానికి కేసీఆర్ రావడం లేదని నిరసనలు చేశారు.
రఘునందన్ రావు, ఈటల రాజేందర్.. తెలంగాణ బీజేపీలో కీలక నేతలే. ఇద్దరూ ఈ సారి ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ తమకు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని పట్టుబడుతున్నారు.
ఈ ఎన్నికల్లో హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ ఈటల పోటీ చేశారు. రెండుచోట్లా ఆయనకు ఓటమే ఎదురైంది. గజ్వేల్‌లో రెండో స్థానంలో నిలవగా.. హుజురాబాద్‌లో మూడో స్థానానికి పడిపోయిన పరిస్థితి. ఇంత ఘోర పరాభవాన్ని ఈటల వర్గమే కాదు.. జనాలు కూడా ఊహించి ఉండరు బహుశా!
ఈటల.. తెలంగాణ రాజకీయాల్లో ఇది పేరు మాత్రమే కాదు.. ఓ బ్రాండ్. అలాంటి పేరు తెచ్చుకున్నారు ఆయన! సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఉన్న ఈటల.. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. తన దూకుడు ఏంటో చూపించడం మొదలుపెట్టారు. బీజేపీలో చేరిన తర్వాత.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నారు. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఈటలకు.. ఎన్నికల్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయ్. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలని.. ఈటల తన సొంత నియోజకవర్గంతో పాటు గజ్వేల్‌లోనూ పోటీ చేశారు. హుజురాబాద్‌లో తనకు తిరుగు ఉండదని భావించిన ఈటల.. ఎక్కువ గజ్వేల్‌పైనే ఫోకస్ పెట్టారు. అదే కొంప ముంచింది. రెండుచోట్ల ఓటమికి కారణం అయింది.
గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తున్నావ్.. ? కేసీఆర్ ను అంత ఈజీగా వదల..
నిజానికి కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్లో ఈటల టాప్ త్రీలో ఉండేవారు. కారు పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన ఈటల.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ గూటికి చేరుకున్నారు. కమలం పార్టీలో కీలక నేతగా ఉంటున్న ఆయన.. యాక్టివ్‌గా ఫీల్డ్‌లో కనిపిస్తున్నారు.
తెలంగాణలో హ్యాట్రిక్ అధికారమే లక్ష్యంగా కారు స్టీరింగ్ తిప్పుతున్న కేసీఆర్‌కు.. ఆ ఆశ అంత ఈజీగా నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా.. జనాల్లో వ్యతిరేకత ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ఆయన్ను ఓడిస్తామంటూ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా కేసీఆర్‌తో తలపడుతున్నారు. అయితే వీళ్ళే కాదు.. రక రకాల సమస్యలపై కేసీఆర్‌పై బాధితులు భారీగా నామినేషన్లు వేశారు.
నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయ్. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల 96వేల క్యాష్ మాత్రమే ఉందని చెప్పారు కేసీఆర్.
తెలంగాణ (Telangana) ఎప్పుడూ చూడని పరిణామాలు ఈసారి ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. కేసీఆర్ (KCR) ను టార్గెట్ చేసిన విపక్షాలు.. ఆయన మీద పోటీకి కీలక నేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఈసారి కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్నారు.