Home » Tag » Game Changer
మెగా ఫ్యాన్స్ పుష్ప 2 కంటే ఎక్కువ ఎదురు చూసే సినిమా... గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ సోలోగా వస్తున్న సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ వెయిటింగ్ పీక్స్ లో ఉంది.
ఎవరితో గోక్కున్నా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు స్టార్ హీరో ఫ్యాన్స్ తో గోక్కోవద్దు. ఈ సూత్రం తెలియక దేవర విషయంలో యాంటీ ఫ్యాన్స్ గుడ్డలు చించుకుని ట్రోల్ చేసారు. ఎన్టీఆర్ దమ్ము ఏంటో తెలియక దేవరను తక్కువ అంచనా వేసారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ టీజర్ రానే వచ్చింది. లక్నో వేదికగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మూవీ టీం. 1 నిమిషం 30 సెకన్ల డ్యూరేషన్లో సినిమా లైన్ మొత్తం చెప్పేశాడు శంకర్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఏడేళ్ళ తర్వాత రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే పలు మార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.
ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన దేవర ఏ గడ్డ మీదైదే 50 కోట్లు కలెక్ట్ చేసిందో... ఏ గడ్డ మీద ఖాన్లు, కపూర్లు కూడా అంత ఎమౌంట్ ని రాబట్టలేకపోయారో, ఆ ఏరియాలో జెండా ఎగరేసే స్కెచ్ వేశాడు మెగా పవర్ స్టార్.. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ గా ఫోకస్ అయ్యారు.
పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ అందనంత ఎత్తుకు ఎదిగాడు. తర్వాత పుష్ప వల్ల అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారాడు. ఆతర్వాత త్రిబుల్ ఆర్ పుణ్యమాని ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ అయ్యారు. కాకపోతే రాజమౌళి సపోర్ట్ లేకుండా పాన్ ఇండియాని షేక్ చేయగలనని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు.
దేవర ట్రెండ్ బెండ్ తీసే రికార్డులతో దూసుకెళ్లాడు. ఇంకా దూసుకెళుతూనే ఉన్నాడు. త్రిబుల్ ఆర్ లో తనతో కలిసి నటించటమే కాదు, రియల్ లైఫ్ లోకూడా ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండే అయినా చరణ్ కి దేవర వల్ల కష్టాలు తప్పట్లేదు. ఆల్రెడీ రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన హీరోగా తనకు మరోరికార్డు క్రియేట్ అయ్యింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప2 వస్తే సీన్ రివర్స్ అవుతుందన్నారు. ఇక డిసెంబర్ లో బన్నీకి సినిమా కష్టాలే అనేశారు. దీనికి తోడు డిసెంబర్ 27న గేమ్ ఛేంజర్ వస్తే పుష్ప 2 వసూళ్లకి గండి పడుతుందన్నారు. కట్ చేస్తే రిలీజ్ కిముందే సీన్ మారిపోయింది.
సినిమాల్లో ఇప్పుడు కొనసాగుతున్న సంస్కృతి అత్యంత దారుణం. ఎవడు ఎన్ని మాట్లాడినా ఒక సినిమాపై మరో సినిమా ఫ్యాన్స్ అత్యంత దారుణంగా విమర్శలు చేయడం, ట్రోల్ చేయడం సినిమాపై నెగటివ్ ప్రచారాన్ని పెంచడం ఏ మాత్రం సమర్ధించేది కాదు.
కోలీవుడ్ లివింగ్ లెజెండ్ శంకర్ ఈమధ్య తను రైట్స్ తీసుకున్న ఓ నవలని కాపీ కొట్టకండి అంటూ ఫైర్ అయ్యాడు. తన మాట వినకుండా కాపీ కొడితే, లీగల్ గా యాక్షన్ తీసుకుంటానన్నాడు. ఇది కొత్త న్యూసేం కాదు. కాని కొత్త డెవలప్ మెంట్ ఏంటంటే, తను కొరటాల శివ ని టార్గెట్ చేసే ఈ కామెంట్ చేశాడనంటున్నారు.