Home » Tag » GHMC Staff
హైదరాబాద్ లో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నాళాలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. నగరవాసులకు ట్రాఫిక్ జాంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగవచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
నాన్‌స్టాప్ వర్షాలు.. హైదరాబాద్‌వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయ్. ఎక్కడ ఏ డ్రైనేజీ ఉందో.. ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ చెట్టు విరిగిపడుతుందో అనే భయం.. ఇళ్లు వదిలి అడుగు బయటపెట్టకుండా చేస్తున్నాయ్.
హైదరాబాద్ ను ముంచెత్తిన వాన..
డల్లాస్ చేస్తాం.. న్యూయార్క్‌లా మారుస్తాం.. ఇది హైదరాబాద్ గురించి పార్టీలు ప్రభుత్వాలు చెప్పే మాటలు. ఇవన్నీ తర్వాత సార్.. బతకనివ్వడం.. బతికేందుకు ధైర్యం ఇవ్వండి అని జనం చేస్తున్న విన్నపం. చినుకు పడితే చాలు భాగ్యనగర వాసుల వెన్నులో వణుకు మొదలవుతోన్న పరిస్థితి. ఎండాకాలంలో కురిసిన వానలు కూడా.. ఓ నిండు ప్రాణాన్ని తీసేసుకున్నాయ్. ఇది చాలు ఎంత దారుణంగా ఉన్నాయో హైదరాబాద్‌లో పరిస్థితులు చెప్పడానికి. రంగు రంగుల భవంతులు.. భారీ విగ్రహాలు, జిల్జిగేల్మనే కట్టడాలు.. ఇవన్నీ నగరానికి ఒకవైపు మాత్రమే.
శనివారం ఉదయం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కార్లు కొట్టుకొని వస్తున్నాయి.
శనివారం ఉదయం నుంచి పడుతున్న వర్షానికి యాదగిరి ఆలయ ఘాట్ రోడ్లు క్రుంగిపోయాయి. టెంపుల్ బయట ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.
హైదరాబాద్ లో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నాళాలన్నీ పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైయ్యాయి.