Home » Tag » Gill
ఆస్ట్రేలియా టూర్ జరుగుతుండగానే కాదు ముగిసిన తర్వాత కూడా రోహిత్ , విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై పెద్ద చర్చే జరిగింది. రోహిత్ తాను రిటైర్ కావడం లేదంటూ క్లారిటీ ఇవ్వగా కోహ్లీ మాత్రం స్పందించలేదు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ సారి స్టార్ ప్లేయర్స్ అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆసీస్ గడ్డపై అద్భుతమైన రికార్డున్న విరాట్ కోహ్లీతో సహా రోహిత్ , గిల్, పంత్ నిరాశపరిచారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నడూ లేని విధంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. వ్యక్తిగతంగా పేలవమైన ఫామ్ తో నిరాశపరిచాడు
టీ ట్వంటీ ఫార్మాట్ లో ఎక్కువ శాతం బ్యాటర్లదే హవా.. తాజాగా య్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ పరుగుల వరద పారుతోంది. టీ20ల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీకి ఈ టోర్నీ వేదికగా నిలిచింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ గెలిచి జోష్ లో ఉన్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్... యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు.
వరల్డ్ క్రికెట్ లో రికార్డుల ఎవరెస్ట్ గా పేరున్న సచిన్ టెండూల్కర్ ను దాటేస్తూ సరికొత్త శకానికి తెరతీసింది ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీనే... అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనూ టన్నుల కొద్దీ పరుగులు, వందల కొద్దీ రికార్డులు కొట్టేస్తూ రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు.
ఐపీఎల్ మెగావేలం ముంగిట రిటెన్షన్ లిస్టులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఊహించినట్టుగా కొందరిని రిటైన్ చేసుకుంటుంటే.. మరికొందరిని వదలుకోక తప్పడం లేదు. అదే సమయంలో ఖచ్చితంగా రిటెన్షన్ లిస్టులో ఉంటారనుకున్న ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు షాకిస్తున్నాయి.
న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ను భారత్ ఓటమితో ప్రారంభించింది. సొంతగడ్డపై ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా బెంగళూరులో అనూహ్యంగా పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో 46 రన్స్ కే కుప్పకూలడం, తర్వాత రెండో ఇన్నింగ్స్ లో పోరాడినా ఫలితం మాత్రం మారలేదు.
టీ ట్వంటీ ఫార్మాట్ వచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్ కు ఆదరణ తగ్గింది.. అటు అభిమానుల్లోనే కదా ఇటు ఆటగాళ్ళలోనూ రెడ్ బాల్ ఫార్మాట్ పై ఆసక్తి అంతగా కనిపించడం లేదు. ఎందుకంటే టెస్టుల్లో ఆడడం అంత సులభం కాదు.
టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తో సిరీస్ లో దుమ్మురేపుతాడనుకుంటే తొలి టెస్టులో డకౌటయ్యాడు. ఈ డకౌట్ తో ఒక చెత్త రికార్డును కూడా గిల్ మూటగట్టుకున్నాడు.
మన క్రికెటర్లు సినిమా సెలబ్రిటీలతో డేటింగ్ చేయడం మూమూలే... వీటిలో కొన్ని పెళ్ళి వరకూ వెళితే.. మరికొన్ని డేటింగ్ తోనే ఆగిపోతుంటాయి. తాజాగా టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ డేటింగ్ పుకార్లు వైరల్ గా మారాయి. గిల్ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.