Home » Tag » Glass Symbol
జనసేనకు ఇక గుర్తు కష్టాలు తీరినట్టే. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గాజు గ్లాస్ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పినట్టే. 2024 ఎన్నికలు పవన్ పార్టీని కష్టాల నుంచి గట్టున పడేసినట్టే అంటున్నారు. జనసేన ఇక నమోదైన పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీ హోదా పొందబోతోంది
తెలంగాణలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాక్టర్, మోడల్ దాసరి సాహితి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. రీసెంట్‌గానే చేవెళ్ల నుంచి నామినేషన్ కూడా వేసింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడంతో సాహితికి కూడా గ్లాస్ గుర్తు కేటాయించింది ఈసీ.
ఇప్పటికే 60కిపైగా ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయించింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భారీ నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్లాసు గుర్తును ఎవరికీ కేటాయించకూడదంటూ జనసేన ఈసీని కోరింది.
ఏపీలో కూటమిని గాజుగ్లాస్ సింబల్ టెన్షన్ వెంటాడుతోంది. ఇప్పటికే ఈ గుర్తు విషయంలో జనసేన చాలా సార్లు సమస్యలు ఫేస్ చేసింది. ఇప్పడు నామినేషన్లు కూడా పూర్తయ్యాక కొత్త సమస్య తలెత్తింది. ఏపీలో ఇండిపెండెట్లుగా ఉన్న క్యాండెట్‌కు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు అధికారులు.
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనలతో ఏపీ సీఈఏ ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు దక్కనుంది. ఇది ఆ పార్టీకి పెద్ద ఊరటగా చెప్పుకోవాలి.
పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న అభ్యర్థుల్ని పోటీలో దించుతోంది. పవన్ పూర్తి పేరు కొణిదెల పవన్ కళ్యాణ్. అయితే, ఈ పేరుకు దగ్గరగా ఉండే.. కోనేటి పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు అభ్యర్థులు కూడా పిఠాపురం నుంచి అసెంబ్లీకి బరిలో నిలిచినట్లు తెలుస్తోంది.
ఫ్రీ సింబల్స్‌లో ఉన్న గ్లాసును తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో గాజు గ్లాసు గుర్తుపై జనసేన టెన్షన్ తీరిపోయింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో సవాల్ చేయడంతో జనసైనికులు టెన్షన్ పడ్డారు.
ఈ మధ్య గాజు గ్లాసుని తమకే కేటాయించారంటూ జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే, ఎన్నికల వేళ విడుదలైన ఈసీ గెజిట్ నోటిఫికేషన్ ఆ పార్టీకి షాకిచ్చేలా ఉంది. మరి ఈ గుర్తుకోసం పవన్ పోరాటం చేస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది.
ఎన్నికల సంఘం అనుమతి లేకుండా గాజుగ్లాస్‌ను జనసేన ప్రమోట్ చేసుకుందని.. ఆ గుర్తును జనసేనకు కేటాయించవద్దని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆ గుర్తు జనసేనకు దక్కుతుందా లేదా అనే విషయంలో పార్టీ నేతల్లో కూడా డైలమా ఏర్పడింది.
జనసేన పెట్టుకున్న రిక్వెస్ట్‌తో 2023 సెప్టెంబర్‌లో తిరిగి జనసేనకే గ్లాస్ గుర్తు కేటాయించినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన గాజు గ్లాసు గుర్తుతోనే పోటీ చేయనుంది. అయితే తెలంగాణలో జనసేన చాలా ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో ఆ పార్టీని గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీగా ఈసీ ఇక్కడ గుర్తించలేదు.