Home » Tag » govt.employees
తమ డిమాండ్లు సాధించుకోవడానికి ఇదే మంచి సమయం అని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రభుత్వ సంఘాలు సిద్ధమయ్యాయి. తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ లోపే తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ పెద్దలకు ఇప్పుడు జ్ఞానోదయమైంది. ఉద్యోగ అనుకూల ప్రభుత్వమంటూనే ఉద్యోగులకు చుక్కలు చూపిన ప్రభుత్వం... ఇప్పుడు వాళ్లు తమకు చుక్కలు చూపించకుండా చర్యలు మొదలుపెట్టింది. మరి ఉద్యోగులు మెత్తబడతారా..?
ప్రభుత్వాలు పరిపాలన సజావుగా సాగించాలంటే ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా కీలక పాత్ర పోషించాలి. లేని పక్షంలో ఎంతటి ప్రభుత్వాలైనా వైఫల్యం అవ్వడం తధ్యం. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల పట్ల సానుకూలంగా వ్యవహరించింది. అదే క్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ఆరాష్ట్ర ఉద్యోగులు డీఏ పెంపుకు చేస్తున్న నిరసన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉద్యోగులు సూచించినంత స్థాయిలో డీఏ ఇవ్వలేము అవసరమైతే నా తల తీసేయండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరేమో సానుకూలం, ఒకరేమో ప్రతికూలం ఎందుకు ఇలా ద్వైత సిద్దాంత ధోరణి అవలంభిస్తారో తెలుసుకుందాం.