Home » Tag » Gram Panchayat
తెలంగాణలో (Telangana) పదవీ విరమణ పొందుతున్న గ్రామపంచాయతీ సర్పంచ్ ల పరిస్థితి దారుణంగా ఉంది. అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే లక్షలు... కోట్లల్లో డబ్బులు ప్రభుత్వం నుంచి రాలేదు. ఇప్పుడు పదవీ కాలం అయిపోతుండటంతో తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న 10యేళ్ళల్లో ఏనాడూ గ్రామపంచాయతీ (Gram Panchayat) సర్పంచ్ (Sarpanch) ల గోసను పట్టించుకోలేదు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం (KCR Government). కానీ ఇప్పుడు దిగిపోయాక.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సడన్ గా సర్పంచ్ ల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. వాళ్ళ బిల్లుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతా అంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.
తెలంగాణలో ప్రజా పాలన కార్యక్రమం మొదలైంది. రాష్ట్రం అంతా హడావుడి కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్.. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార పార్టీ నేతలు, అధికారులు.. గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు అందరి మెదళ్లలోనూ ప్రధానంగా తిరుగుతున్న ప్రశ్న ఒక్కటే.. అదే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడా అని! ఐతే తెలంగాణలో ఇప్పట్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు.