Home » Tag » Group 1
సార్ ప్లీజ్.. దయచేసి నన్ను లోపలికి వెళ్లనివ్వండి. ఈ పరీక్ష రాసి క్వాలిఫై అయితే నా ఆశయం నెరవేరుతుంది. ప్లీజ్ సార్ బస్ లేట్‌గా వచ్చింది. అందుకే ఆలశ్యం అయింది. లోపలికి వెళ్లనివ్వండి... గ్రూప్ వన్ ఎగ్జామ్ పరీక్షా కేంద్రం వద్ద ఓ అభ్యర్ధి ఆవేదన.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ సెక్రెటరీ బుధవారం విడుదల చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి.
పాత గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. ఇటీవల 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
గతంలో 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలకాగా.. ఇప్పుడు 60 పోస్టులు పెంచి, మొత్తం 563 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకానుంది.
దాదాపు రెండేళ్లక్రితం 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. కానీ, రెండేళ్లక్రితం తొలిసారి నిర్వహించిన గ్రూప్-1 పేపర్ లీకైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీతోపాటు ఇతర అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, పాత నోటిషికేషన్ రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ సెక్రెటరీ డా.నవీన్ నికోలస్ పేర్కొన్నారు.
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొత్త పోస్టులతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదలవుతుందా..? లేక పాత నోటిఫికేషన్ రద్దు చేసి, దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత రావొచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. ముందుగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తాం అంటూ.. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో, ప్రకటనల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది.
తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.
తెలంగాణాలో టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయంగా మారుతున్న తరుణంలో తిరిగి రాసే అవకాశం వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.