Home » Tag » Guvwala Balaraju
అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తగ్గేదేలా.. అన్నట్టుగా నడుస్తున్నాయి రివెంజ్ పాలిటిక్స్. నాడు నువ్వు తమలపాకుతో ఒక్కటంటే.. నేడు నేను తలుపు చెక్కతో రెండంటా అన్నట్టుగా ఉందట వ్యవహారం. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరున్న సెగ్మెంట్ కావడంతో, గతాన్ని నెమరేసుకుంటూ యాక్షన్ ప్రోగ్రాం అమలు చేస్తున్నారట స్థానిక అధికార పార్టీ నేతలు. తాజాగా మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజును జిల్లాలోకి అడుగు పెట్టకుండా సరిహద్దులోనే పోలీసులు అరెస్టు చేయడం లోకల్‌గా హాట్ టాపిక్ అయింది.
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvwala Balaraju) పై జరిగిన దాడి ఒక్కసారిగా అచ్చంపేట రాజకీయం హీటెక్కింది. నిన్న ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న గువ్వల బాలరాజు వర్గానికి.. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ అభ్యర్థులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మార్గ మధ్యలో మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇరు వర్గాల కార్యకర్తలకు గాయాలయ్యాయి. గువ్వల బాలరాజు కూడా తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించారు.
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ (Congress) అభ్యర్థి వంశీకృష్ణ (Vamsi Krishna) తన అనుచరులతో కలిసి బాలరాజు మీద దాడి చేసిన విధానాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో దాడుల సంస్కృతి ఎప్పుడు లేదు.. కాంగ్రెస్ పూర్తిగా రౌడీ రాజకీయం తీసుకోస్తుంది ఇది మేకే మంచిది కాదు..
నాగర్‌కర్నూల్ (Nagarkurnool ) జిల్లా అచ్చంపేట ( Atchampet ) లో ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే (MLA ) గువ్వల బాలరాజు (Guvwala Balaraju) ప్రచార కార్యక్రమంలో గలాటా జరిగింది. ప్రచారం ముగించుకుని బాలరాజు తిరిగి వస్తుండగా.. ఆయన వర్గీయులకు, కాంగ్రస్ అభ్యర్థి వంశీకృష్ణ వర్గీయులకు మధ్య వివాదం జరిగింది.