Home » Tag » GVL Narasimha Rao
సడన్‌గా విశాఖపట్నం లోక్‌సభ నియోజవకర్గంలోని 7 పార్లమెంట్ సీట్లల్లో రాత్రికి రాత్రి వెలిసిన పోస్టర్లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జనజాగరణ సమితి పేరుతో విశాఖ ఎంపీ టిక్కెట్ GVLకే ఇవ్వాలంటూ ఈ ఫ్లెక్సీలు కట్టారు.
ఈ జాబితాలో పార్టీ కోసం అంత కష్టపడ్డాం.. ఇంత కష్టపడ్డాం అని చెప్పుకునే నేతలకు మాత్రం చోటు దక్కలేదు. దీంతో చాలా మంది సీనియర్లు డీలా పడ్డట్టే కన్పిస్తోంది. ముఖ్యంగా సోమువీర్రాజు, జీవీఎల్, మాధవ్, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్ లాంటి వారి పేర్లు లిస్ట్‌లో లేవు.
ఈసారి ఎలాగైనా వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్న జీవీఎల్‌కు.. చంద్రబాబు షాక్ ఇచ్చారు. టీడీపీ అనౌన్స్ చేసిన మూడో జాబితాలో 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. విశాఖ నుంటి టీడీపీ తరఫున శ్రీభరత్ పోటీ చేయబోతున్నారని ప్రకటించారు.
175 టార్గెట్ (Wynat 175) పెట్టుకుని వైనాట్ అంటున్న YSRCP ఆ ఒక్క సీటులోనే ఎందుకు తర్జన భర్జన పడుతోంది...? గెలవడం కంటే అభ్యర్థిని ఖరారు చేయడమే కీలకం అనే స్థాయిలో ఉత్కంఠ వెనుక రీజన్ ఏమై ఉంటుంది...? బీసీలకు ఛాన్స్ అనే క్లారిటీతో వున్న ఫ్యాన్ పార్టీ హైకమాండ్... ఎవరి ఎత్తుగడలు తిప్పికొట్టేందుకు రెడీ అవుతోంది...?
ఢిల్లీ, గుజరాత్లో ఎన్నికల సర్వేలు చేసి.. బీజేపీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేసిన జీవీఎల్ నర్సింహారావును ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపారు. ఈసారి ఏపీలోని విశాఖపట్నం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో నిలబడాలని ఆశపడ్డారు.
విశాఖ (Visakha) వన్ టౌన్... పేరుకి పాత నగరమే కానీ ఇక్కడ రాజకీయం మాత్రం రంగుల రాట్నం. ఎప్పటికప్పుడు మారిపోయే ఈక్వేషన్లు ఎవరికి ఎందుకు సెట్ అవుతాయో... ఎవరికి ఫిట్టింగ్ పెడతాయో అంచనా వేయడం కష్టం. పునర్విభజన తర్వాత విశాఖ దక్షిణంగా పేరు మార్చుకున్న ఈ నియోజకవర్గం గ్రేటర్ వైజాగ్‌కే ఆయువు పట్టు. సాంప్రదాయ రాజకీయాలు కనిపించినా... ఓటర్ల తీర్పు విలక్షణంగా వుంటుంది.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కూడా విశాఖ ఎంపీ టిక్కెట్ కోసం హడావిడి చేస్తున్నారు. గత కొంత కాలంగా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. తాజాగా SBI-CSR నిధులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం వివాదస్పదమైంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. విశాఖ సీటుపై కన్నేసిన పురంధేశ్వరి, జీవీఎల్ నరసింహారావు ఇద్దరూ ఎత్తులు పైఎత్తులతో వేడి పుట్టిస్తున్నారు. ఇంతకీ విశాఖ సీటు దక్కేదెవరికి..?
ఏపీ బీజేపీలో జంపింగుల కలకలం కొనసాగుతోంది. కన్నా లక్ష్మినారాయణ పార్టీకి కటీఫ్ చెప్పడంతో ఇంకెంతమంది నేతలు వెళ్లిపోతారోననే భయం ఆ పార్టీకి పట్టుకుంది.
నేతలు రావడం, పోవడం పొలిటికల్ పార్టీల్లో మామూలే... కానీ ఏపీ బీజేపీలో మాత్రం ఎగ్జిట్‌లే తప్ప ఎంట్రీలు ఉండటం లేదు. ఇలాగైతే ఎలా అంటూ కరడు గట్టిన కమలం కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారు.