Home » Tag » Harshith rana
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది.. పెర్త్ టెస్టులో భారత్ అదరగొట్టి కంగారూలను చిత్తు చేస్తే... ఆతిథ్య జట్టు పింక్ బాల్ టెస్టులో బౌన్స్ బ్యాక్ అయింది. పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ అడిలైడ్ లో రివేంజ్ తీర్చుకుంది. దీంతో సిరీస్ లో ఇరు జట్లు 1-1-1తో సమంగా ఉన్నాయి.
న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకునేందుకు రెడీ అవుతోంది. ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి జరగనున్న చివరి టెస్టుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
టీమిండియాలో చోటు దక్కాలన్నా... వచ్చిన ప్లేస్ నిలబెట్టుకోవాలన్నా ఆట మాత్రమే ఉంటే సరిపోదు... ఫిట్ నెస్ కూడా ఉండాల్సిందే... ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఫిట్ నెస్ లేకుంటే కెరీర్ ముగిసిపోయినట్టే... అందుకే ఇప్పుడు జట్టులోకి వస్తున్న యువ ఆటగాళ్ళందరూ ఫిట్ నెస్ పై ఫోకస్ మరింత పెంచారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న హర్షిత్ రాణా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఢిల్లీ యువ పేసర్ తాజాగా రంజీ సీజన్ లో అదరగొడుతున్నాడు. అస్సాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో 4 వికెట్లతో సత్తా చాటాడు.