Home » Tag » High Command
బీజేపీపై పోరులో అసలు కాంగ్రెస్ను లెక్కలోకి తీసుకోని పార్టీలు కూడా కలిసి నడుద్దాం అని ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ ముందు ఆఫర్లు పెడుతున్నాయి. మిగతా చోట్ల కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం కొత్త జోష్ కనిపిస్తోంది.
కర్ణాటక కొత్త సీఎంగా సిద్దరామయ్య పేరును ప్రతిపాదించింది ఢిల్లీ కాంగ్రెస్ అధిష్ఠానం.
కర్ణాటక సీఎం ఎవరు అన్న విషయంలో ఉత్కంఠకు తెరపడింది. కన్నడ రాజ్యానికి కాబోయే సీఎం ఎవరో హైకమాండ్ నిర్ణయించింది. అంతా అనుకున్నట్టే సిద్ధరామయ్యను మరోసారి కర్ణాటకకు సీఎంను చేసింది. ఇదే విషయాన్ని సాయంత్రం అధికారికంగా ప్రకటించబోతోంది కాంగ్రెస్ హై కమాండ్. రేపు కంఠీరవ స్టేడియంలో కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటే మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
కర్ణాటక సీఎం రేసులో కొనసాగుతున్న ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయంతో దాదాపు సిద్ధరామయ్య పేరునే హైకమాండ్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ సీఎంగా చేసిన అనుభవం ఉండటం.. క్లీన్ బ్యాంగ్రౌండ్ ఉండటం సిద్ధరామయ్యకు కలిసివచ్చింది. ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న అసలు టెన్షన్ డీకే శివకుమార్.
కర్ణాటక ఎన్నికల్లో అన్ని సర్వేలు ఏం చెప్పాయో అదే జరిగింది. ఊహించినదానికంటే ఎక్కువ మెజార్టీతో కన్నడ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకు ముఖ్య కారణం.. పార్టీ నేతల మధ్య ఐక్యత. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత పోరు గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు.
వైస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. 2010 లో కాంగ్రెస్ ని వీడిన తరవాత మళ్ళీ కాంగ్రెస్ హైకమాండ్ ని కలవడం ఇదే మొదటి సారి. సోదరుడు జగన్ తో విభేధాలు.. ఆ తరవాత తెలంగాణ వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడం.. పాదయాత్ర ఈ పరిణామాల మధ్య షర్మిళ కాంగ్రెస్ హైకమాండ్ కలయిక కు ప్రాధాన్యం ఏర్పడింది.