Home » Tag » Himalayas
ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అన్నీ సైన్స్‌కు అంతుపట్టవు. ఆ రహస్యాల వెనుక మర్మం కనుక్కోవాలని శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. కానీ... సమాధానాలు లేని ప్రశ్నలుగానే మిగులుతుంటాయి. అందులో ఒకటి హిమాలయాల్లోని మణికరణ్ పుణ్యక్షేత్రం.
అమర్నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. జూన్ 29 వ తేదీన ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు రోజూ వేలాది మంది భక్తులు హిమాలయాల్లోని ఆ మంచు శివలింగం దర్శనం కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు.
జీవితంపై వ్యామోహం తగ్గిపోయి... భగవంతుడి సాన్నిధ్యంలో గడపాలని సన్యాసం తీసుకున్నవాళ్ళు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటారు. లేదంటే ప్రశాంతంగా జీవిస్తారు.
అమర్ నాధ్ యాత్ర అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ ట్రాక్, గందర్బల్ జిల్లాలోని బల్తాల్ మార్గాల్లో ఒకేసారి ప్రారంభంకానున్నది. ఈసారి యాత్రకు భారీగా భద్రతను కల్పించనున్నారు. అమర్ నాథ్ యాత్రికుల కోసం శ్రీఅమర్నాథ్ క్షేత్ర బోర్డు, జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతేడాది 4.5 లక్షల మందికిపైగా భక్తులు అమర్నాథ్ గుహను సందర్శించారు.
ఉత్తరాఖండ్ (Uttarakhand) లో ప్రతి సంవత్సరం ఈ సీజన్ లో హిమాలయా ట్రెక్కింగ్స్ (Himalayan trekking) చేస్తుంటారు. కాగా ఈ సంవత్సరం కూడా ఓ ట్రెక్కింగ్ బృదం.. హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ మనేరికి చెందిన 22 మంది సభ్యుల బృందం మే 29న ఉత్తరకాశీ (Uttarkashi) నుంచి 35 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ప్రారంభించింది.
రుద్రప్రయాగ్ (Rudraprayag) జిల్లా : రేపు ఉదయం 7.00 నిమిషాలకు పన్నెండు జ్యోతిర్లింగ ఒక్కటైన కేధార్ నాథ్ క్షేత్రం ఆలయాన్ని ద్వారాలు తెరుచుకోనున్నాయి. కేధార్ నాథ్ (Kedarnath) ఆలయ ద్వారాలను పూజలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రధాన పూజారి జగద్గురు రావల్ బీమా శంకర్ లింగ శివాచార్య ఓపెన్ చేయనున్నారు.
దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అడవుల్లో భారీగా కార్చిచ్చు చెలరేగింది. దీంతో గత మూడు రోజులుగా అంచలంచలుగా అడువలు కాలిబూడిదయ్యిపోతున్నాయి. అటవీ జంతువులు మృత్యువాత పడుతున్నాయి. కాగా ఇప్పటి వరకు దాదాపు 1100 హెక్టార్ల పరిధిలో అటవీ ప్రాంతం కాలిబూడిదయ్యింది.
మనాలి - కీ లాంగ్ (Keylong) - సిస్సు (Sissu) హైవే పక్కన సమీపంలోని సెల్ఫీ పాయింట్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కీలాంగ్‌కు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు (BRO) వారు తెలిపారు.
ఈ ఆలయం భారతదేశంలోని ఉత్తరాన హిమాలయ పర్వతాలలో ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లా త్రియుగి నారాయణ్ అనే స్థలంలో ఆ ఆలయం ఉంది. ఈ ప్రదేశంలో ప్రధానంగా విష్ణువు, శివుడు, పార్వతి ఉంటారు. కేధార్ నాథ్ ఆలయం (KedarNath Temple) మార్గంలో ఈ ఆలయం ఉంటుంది.
కేదార్నాథ్ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం (పుణ్యక్షేత్రం). మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది.