Home » Tag » Hit and run case
బోదన్ సీఐగా పని చేస్తున్న ప్రేమ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రేమ్ కుమార్‌తో పాటు మరో వ్యక్తిని కూడా పంజాగుట్ట పోలీసులు విచారణ నిమిత్తం బయటికి తీసుకువెళ్లారు. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన కీలక విషయాలు ప్రేమ్‌కుమార్‌కు తెలుసని చెప్తున్నారు పోలీసులు.
ఒక్కసారిగా పెట్రోల్ బంకుల ముందు క్యూలు... వాహనదారులంతా పెట్రోల్, డీజిల్ కొట్టించుకోడానికి పోటీలు పడ్డారు... ఏంటి ఎందుకింత రష్. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయా... అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న భారత న్యాయ సంహిత చట్టాలపై డ్రైవర్లు అభ్యంతరం చెబుతున్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో భారీగా శిక్షలను ప్రతిపాదించడమే ఇందుక్కారణం. అందుకే పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్లు, ట్రక్కుల డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. దాంతో పెట్రోల్ సరఫరా ఎక్కడ ఆగిపోతుందో అని దేశవ్యాప్తంగా బంకుల దగ్గర వాహనదారులు క్యూ కట్టారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ హామీతో డ్రైవర్లు ఆందోళన విరమించారు.
హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ను తప్పించడానికి 30 లక్షలకు బేరం కుదిరినట్టు తెలుస్తోంది. ఈనెల 23న బేగంపేట ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.
BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయన ఎక్కడ ఉన్నా హైదరాబాద్‌కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో సాహిల్ నిందితుడిగా ఉన్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. దుబాయ్ పారిపోయినట్లు సమాచారం. కానీ సాహిల్ ఇక్కడే ఎక్కడో ఉండవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ శాఖలోనే కొందరు మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సహకరిస్తున్నారన్న సమాచారం కూడా ఉంది.