Home » Tag » Home Loans
క్రెడిట్ కార్డు అంటేనే చేతిలో ఆస్తి ఉన్నంత ఆనందం. దీనిని సక్రమంగా వినోయోగిస్తే బంగారు గుడ్డు పెట్టే బాతులా ఉంటుంది. అదే సరైన దారిలో ఉపయోగించకుండా డ్యూ గడువులు దాటవేసే కొద్దీ దాని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి బ్యాంకు రుణాలు, ఫైనాన్స్ సంస్థల నుంచి ఆదాయానికి చెక్ పడుతుంది. తాజాగా వెల్లడైన గణాంకాల ప్రకారం క్రెడిట్ కార్డులు తీసుకొని బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 2 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు తెలిసింది. ఇది కేవలం ఏప్రిల్ మాసానికి చెందిన లెక్కలు మాత్రమే. రానున్న రోజుల్లో వీటి ప్రభావం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అసలు ఇంత స్థాయిలో రుణాలు చెల్లించేలా పరిస్థితి ఎందుకు మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా ఫెడ్ మరోసారి వడ్డీరేట్లు పెంచింది. అయితే వాత పెట్టిన వెంటనే వెన్న కూడా పూసింది. వడ్డీరేట్ల పెంపునకు ఇక బ్రేక్ పడినట్లే అని సంకేతాలు ఇచ్చింది. వడ్డీరేట్ల పెంపు ఇబ్బందే అయినా ఇక ముందు పెంచబోమన్నది మాత్రం పెద్ద ఊరటే.
గృహరుణ వినియోగదారులారా... బీ అలర్ట్.. మీకో బ్యాడ్ న్యూస్... ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు పెంచబోతోంది. మీ బడ్జెట్‌కు బొక్క పెట్టబోతోంది... ఇంతకీ రిజర్వ్ బ్యాంక్ ఎంత మేర వడ్డీ రేట్లు పెంచబోతోంది...? మీ ఈఎంఐ ఎంత మేర పెరగబోతోంది...?
హోం లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నారా...? ఏడాది కాలంగా పెరుగుతున్న వడ్డీరేట్లతో చుక్కలు చూస్తున్నారా...? మరోసారి వడ్డీరేట్లు పెరుగుతాయా...? పెరిగితే మళ్లీ ఎంత పెంచొచ్చు....? ఎప్పుడు పెంచొచ్చు....?