Home » Tag » Huzurabad
ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay), మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etala Rajender) మధ్య విభేదాలు మరింత పెరిగాయా...? అంటే అవునన్న సమాధానమే వస్తోంది పార్టీ వర్గాల నుంచి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇద్దరు నేతలు ఎడ మొఖం పెడ మొఖంగానే ఉంటున్నారట. ఇటీవల బండి సంజయ్ (Bandi Sanjay) హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తూ... పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నిలకు (Parliament Elections) సమాయాత్తం చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) పోటీ చేసి గెలిచిన 24 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎలక్షన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 24 మంది మీద 30 దాకా పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ సమర్పించారు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు. అఫిడవిటల్స్ లో తప్పులు, ఈవీఎంలు, వీవీ పాట్స్ లో లోపాలు లాంటి కారణాలతో ఈ పిటిషన్లు ఫైల్ అయ్యాయి.
ఈటల రాజేందర్. నిన్న మొన్నటిదాకా ఆయన సంచలనం.. ఏం చేస్తారు? అడుగులు ఎటువైపు పడుతున్నాయంటూ ఎప్పటికప్పుడు ఆరాలు తీసేవి రాజకీయ వర్గాలు పార్టీ మారినా ఏ మాత్రం పట్టు తగ్గకుండా రాజకీయం చేశారు. కానీ.. ఇప్పుడు సీన్ సితారైంది. రేపు ఎటు తెలియని అయోమయం లో పడ్డారు.
కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఈటల.. హుజూరాబాద్‌లో ఛాలెంజ్ చేసి బైపోల్లో గెలిచారు. కేసీఆర్‌కు టఫ్ ఫైట్ ఇచ్చే నాయకుడిగా చూశారు. బీజేపీ కూడా ఈటలకు అంతే ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. ఆత్మవిశ్వాసమో.. అతివిశ్వాసమో కానీ.. ఎన్నికల వేళ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని ఈటల నిర్ణయించుకున్నారు.
ఈటల.. తెలంగాణ రాజకీయాల్లో ఇది పేరు మాత్రమే కాదు.. ఓ బ్రాండ్. అలాంటి పేరు తెచ్చుకున్నారు ఆయన! సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఉన్న ఈటల.. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. తన దూకుడు ఏంటో చూపించడం మొదలుపెట్టారు. బీజేపీలో చేరిన తర్వాత.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నారు. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఈటలకు.. ఎన్నికల్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయ్. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలని.. ఈటల తన సొంత నియోజకవర్గంతో పాటు గజ్వేల్‌లోనూ పోటీ చేశారు. హుజురాబాద్‌లో తనకు తిరుగు ఉండదని భావించిన ఈటల.. ఎక్కువ గజ్వేల్‌పైనే ఫోకస్ పెట్టారు. అదే కొంప ముంచింది. రెండుచోట్ల ఓటమికి కారణం అయింది.
ఎన్నో ఏళ్ల నుంచి పౌల్ట్రీ బిజినెస్ చేస్తున్నారు ఈటెల రాజేందర్. కింది స్థాయి నుంచి వచ్చిన ఈటెల రాజేందర్ వ్యాపారంలో బాగా సంపాదించి కోట్లకు అధిపతి అయ్యారు.
హుజురాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయి. కాంగ్రెస్‌కు రెండవ స్థానం.. బిజెపి మూడో స్థానానికి పడిపోయింది. కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. ఒకవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ.. మరోవైపు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటారు.