Home » Tag » Hyderabad Sunrisers
ఇండియన్ క్రికెట్ లో ఇప్పుడు తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఐపీఎల్ తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నితీశ్ ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు.
ఐపీఎల్ 18వ సీజన్ లో రెండోరోజే పరుగుల వరద మొదలైంది. ఎప్పటిలానే సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై దంచికొట్టింది. రికార్డుల మోత మోగిస్తూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించింది.
ఐపీఎల్ 18వ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అవుతోంది. గత ఏడాది రన్నరప్ తో సరిపెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది.
ఐపీఎల్ 18వ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిన్నటి వరకూ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లతో వన్డే ఫార్మాట్ ను ఎంజాయ్ చేసిన టీమిండియా ఫ్యాన్స్ కు ఇక రెండు నెలల పాటు ఐపీఎల్ వినోదం లభించనుంది.
క్రికెట్ ఫ్యాన్స్ కోసం సమ్మర్ కార్నివాల్ ఐపీఎల్ 18వ సీజన్ వచ్చేస్తోంది. మార్చి 22న ఆరంభమయ్యే ఈ లీగ్ కోసం అన్ని జట్లు ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి.
సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ కు గోల్డెన్ టైమ్ నడుస్తోంది. ఫ్రాంచైజీ క్రికెట్ లో ఆమె తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవలే హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీలో ఆమె మేజర్ వాటా దక్కించుకుంది.
ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగావేలం జరగబోతోంది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాపై ఆయా ఫ్రాంచైజీల కసరత్తు దాదాపుగా పూర్తయినట్టే కనిపిస్తోంది.
గతేడాది పేలవమైన ఆటతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన హైదరాబాద్.. ఈ సీజన్లో ఆరంభం నుంచే అద్భుతంగా ఆడి ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్‌ను 36 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది సన్‌రైజర్స్. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో రాజస్థాన్ ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2024 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. 2 కోట్ల కనీస ధరతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరు పై పోటా పోటీగా వేలం పాల్గొన్నది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్, ఆక్షన్ లో భారీ ధరకు సొంతం చేసుకుంది.