Home » Tag » hydra
మణికొండ లో హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. గత కొన్నాళ్ళుగా సైలెంట్ గా ఉన్న హైడ్రా అధికారులు ఇప్పుడు మళ్ళీ దూకుడు పెంచారు.
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. హైడ్రా రాక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదన్నారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024 కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చదని స్పష్టం చేసారు.
హైదరాబాద్ రియల్టర్ల గుండెల్లో హైడ్రా పెట్టిస్తున్న పరుగులు అన్నీ ఇన్నీ కాదు. కేవలం రియల్టర్లకే కాదు.. తెలిసీ తెలియక బఫర్ జోన్, FTL పరిధిలో ఇళ్లు కొనుక్కున్న కామన్ పీపుల్ కూడా హైడ్రా పేరు చెప్తేనే వణికిపోతున్నారు.
హైడ్రా కమీషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైడ్రా జిహెచ్ఎంసీ లో భాగం కాదన్న ఆయన... ఇప్పుడు సెపరేట్ వింగ్ గా ఏర్పడిందని స్పష్టం చేసారు. హైడ్రా కు మొదటి కమిషనర్ గా ఉండటం సంతోషంగా ఉందన్నారు.
కొంత కాలంగా దేశంలో పెరుగుతున్న బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్ పై వచ్చిన పిటీషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
తెలంగాణాలో హైడ్రా దూకుడు ఆగిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తెలంగాణా ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మున్సిపల్ డెవెలప్మెంట్ అధారటీ పరిధిలో ఉన్న అన్ని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా అర్ధం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. రాజకీయంలో తప్పులను బలంగా మార్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇతర ముఖ్యమంత్రుల తీరుకి ఆయన తీరుకు చాలా తేడా ఉంది.
తెలంగాణాలో ఇప్పుడు హైడ్రా దూకుడుతో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. హైడ్రాకు చట్టబద్దత లేకుండానే కీలక భవనాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే.
FTL పరిధిలో ఇల్లు ఉంది అంటే ఏమాత్రం ఆలోచించకుండా కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇల్లు కట్టినోడిది తప్పు ఐనప్పుడు అనుమతి ఇచ్చినోడిది కూడా తప్పే కదా. మరి వాళ్ల మీద ప్రభుత్వం చర్యలేవి. FTL ఇల్లు ఎందుకు కడుతున్నారు అని అప్పుడే ఎందుకు అడగలేదు.
అధికారంలో ఉన్న వాళ్ళకి ఆవేశమే కాదు ఆలోచన కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా తెలంగాణ లాంటి యాక్టివ్ స్టేట్ లో, ప్రతి పక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో పాలక పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. హైదరాబాదులో సంచలన సృష్టిస్తున్న హైడ్రా బుల్ డోజర్లు కథ ముగిసి పోయేటట్లు ఉంది .