Home » Tag » IAS
ఆంధ్రప్రదేశ్ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఓ క్లారిటీ ఉంది. చిన్న వయసులోనే ఐఏఎస్ గా ఉద్యోగం సంపాదించిన శ్రీలక్ష్మి ఎంతో ప్రతిభవంతురాలైన ఉద్యోగిగా సమర్ధురాలుగా మంచి పేరు తెచ్చుకున్నారు.
కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మూలాలనే పెకలించేసింది. భారీగా అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు.
నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. ఇరిగేషన్ అధికారులు - కమిషన్ వేసిన కమిటీతో భేటీ కానున్న జస్టిస్ చంద్ర ఘోష్... కీలక అంశాలపై విచారణ చేపట్టనున్నారు.
ఎట్టకేలకు తెలంగాణా ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేసారు. డీఓపిటి ఆదేశాల మేరకు ఏపి లో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్ట్ చేసారు. ఏపి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఆమ్రపాలి , రోనాల్డ్ రోస్, వాకాటి అరుణ, వాణి ప్రసాద్ రిపోర్ట్ చేసారు.
2015లో ను కేటాయింపుల పై క్యాట్‌ను ఆశ్రయించారు అధికారులు. తెలంగాణలోనే కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని క్యాట్ ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 2017లో తెలంగాణ హైకోర్టులో కేంద్రం రిట్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు తీర్పు వెల్లడించింది.
రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి లంచాలు తీసుకుంటున్నారు అనే సమాచారం తెలుసుకున్నారు ఏసీబీ అధికారులు. ఎలా అయినా భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుని పక్కా ప్లానింగ్ తో దాడికి దిగారు.
తెలంగాణ రాష్ట్రంలో మరో సారి ఐఏఎస్ బదిలీ జరిగింది. తెలంగాణ (Telangana) నుంచి సుమారుగా 8 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
పవర్ఫుల్ ఐఏఎస్ కృష్ణతేజ.. డిప్యూటీ సీఎం పవన్ పేషీలో చేరిపోయారు. కలెక్టర్‌గా తన మార్క్ ఏంటో కేరళకు పరిచయం చేసిన ఆయన.. ఏపీలో తన పవర్ చూపించేందుకు రెడీ అయ్యారు.
ఐఏఎస్ స్మితా సబర్వాల్ రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ.. స్మిత చేసిన పోస్ట్ తీవ్ర వివాదంగా మారింది. దివ్యాంగులకు ఐఏఎస్ పోస్టులు అవసరమా అని ప్రశ్నిస్తూ ఆమె రాసుకొచ్చిన రాతలు.. ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది.
ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయ నేతల నుంచి.. దివ్యాంగుల సంఘాల వరకు.. స్మితా వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. దివ్యాంగులను ఉద్దేశించి స్మితా చేసిన పోస్ట్.. ఈ రచ్చకు కారణం అయింది.