Home » Tag » Imran Khan
పాక్‌లో బాంబ్ పేలుళ్లు, భారీ హింస మధ్య పోలింగ్ ముగిసింది. ఫలితాలు కూడా వచ్చేశాయ్. ఏ పార్టీ కూడా మెజారిటీ సీట్లను గెలుచుకోలేదు. మొత్తం 265 స్థానాలకు ఎన్నికలు జరగగా.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు 99 చోట్ల గెలుపొందారు.
ఇమ్రాన్‌తోపాటు ఆయన సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషికి కూడా కోర్టు శిక్ష విధించింది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్.. తోషాఖానా కేసులో శిక్ష అనుభవిస్తూ, రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు.
టైటిల్ వినడానికి కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉంది కదా.. అసలు అమెరికాకు లంచం ఇచ్చే పరిస్థితుల్లో పాక్ ఉందా..? అయినా పాక్ దగ్గర లంచం తీసుకోవాల్సిన అవసరం అమెరికాకు ఉందా..?
ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిధుల్ని ఇమ్రాన్ సొంత ఖాతాకు మళ్లించారని, నిబంధనల్ని ఉల్లంఘించారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనపై నమోదైన అభియోగాలు నిజమే అని నమ్మింది.
లెజెండరీ క్రికెటర్లును గౌరవించడం సంబంధిత బోర్డుల కర్తవ్యం.. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి అది తెలియదు. గౌరవించడం సంగతి దేవుడికెరుగు పనిగట్టుకొని అవమానించడం ఆ బోర్డు నైజమని మరోసారి తేలింది.
ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిఫారసుమేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేసినట్లు పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ బుదవారం రాత్రి ప్రకటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇమ్రాన్‌ఖాన్.. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి.. పాక్ పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ ఆడిన ఇమ్రాన్ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. పాక్ రాజకీయ చరిత్రలో చాలా మంది ప్రముఖులు జైలు జీవితం అనుభవించారు. కానీ ఇమ్రాన్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది.
పాకిస్తాన్లో మరో సంచలనం. పాక్ మాజీ ప్రధాని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. తోషఖానా కేసులో ఈ శిక్ష పడింది. తోషఖానా అంటే దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు పాక్ ప్రధానికి ఇచ్చే కానుకల్ని తరలించే ఖజానా.
ఆర్థిక గండం నుంచి గట్టెక్కే విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంలో తాత్సారం చేస్తున్నఅధికార కూటమి.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు మాత్రం ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తోంది.
ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి దాడులు చేసుకుంటున్నారు. దీంతో పాక్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. శాంతి భద్రతలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో సైనిక పాలన రాబోతుందంటూ ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై పాక్ ఆర్మీ అధికారులు స్పందించారు.