Home » Tag » Ind vs Afg
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోహిత్-రింకూ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అత్యధిక టీ ట్వంటీ విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలవడానికి రోహిత్ మరో మూడు విజయాల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో సహా ఐదుగురి పేరిట ఉంది. అఫ్గానిస్థాన్ సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తే టీ20ల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర సృష్టిస్తాడు.
సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టీ ట్వంటీల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ ట్వంటీలు ఆడనున్నారు. టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో ఆడేందుకు వీరిద్దరూ ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో సెలెక్టర్లు ఆఫ్గనిస్తాన్‌తో జరిగే సీరీస్‌కి ఎంపిక చేశారు.
జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడాల్సి ఉండగా, అది వాయిదా పడింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత, బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ సిరీస్ ఎప్పుడు జరుగుతుందో తెలియజేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, జూన్ 23 నుంచి జూన్ 30 వరకు ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను ఆడాల్సి ఉంది.