Home » Tag » IND Vs ENG
ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో దిగలేదు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరించాడు. దీంతో రోహిత్ ఎక్కడా అంటూ అందరూ చర్చించుకున్నారు.
ఐదో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. దీంతో టెస్టు సిరీస్ 4-1తో భారత్ కైవసమైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టు మినహా మిగతా నాలుగు టెస్టుల్లో వరుసగా ఇండియా గెలవడం విశేషం.
తొలి రోజు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు అడ్డుకున్నారు. స్పిన్ త్రయం అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.
పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఎక్స్ట్రా పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పాడు. తుది జట్టు ఎంపిక ఇంకా ఖరారు కాలేదని, మ్యాచ్ ప్రారంభానికి ముందు చివరగా పిచ్ ఔట్ లుక్ చూసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.
జట్టులో సభ్యునిగా లేని రింకూ సింగ్.. ధర్మశాలలో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జట్టులో లేనప్పటికీ అక్కడకు ఎందుకు వెళ్లాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ చర్చించుకుంటున్నారు.
రాహుల్ స్థానంలో రజత్ పాటిదార్‌కు నాలుగో నంబర్లో అవకాశం ఇచ్చినప్పటికీ అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు పాటిదార్ మూడు టెస్టు మ్యాచ్‌లలో, ఆరు ఇన్నింగ్స్‌లలో 32, 9, 5, 0, 17, 0 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
బూమ్రా లేకున్నా భారత పేసర్లు సత్తా చాటడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్‌సేన సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ధర్మశాల పిచ్ దృష్ట్యా బూమ్రాకు తిరిగి చోటు కల్పించింది. ఇదిలా ఉంటే జట్టు ప్రకటనతో పాటు స్టార్ క్రికెటర్లు మహ్మద్ షమి, కేఎల్ రాహుల్ గాయాలపై బీసీసీఐ వివరణ ఇచ్చింది.
విజయానికి మరో 72 పరుగులు అవసరమైన దశలో జట్టును గిల్, జురెల్ ఆదుకున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది.
మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్‌ను జట్టు నుంచి తప్పించింది టీమ్ మేనేజ్మెంట్. వారిద్దరి స్థానంలో షోయబ్ బషీర్, ఒలీ రాబిన్సన్ జట్టులోకి వచ్చారు. రాబిన్సన్కు ఈ సిరీస్‌లో రాంచీ టెస్టు తొలి మ్యాచ్ కానుంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న రవీంద్ర జడేజా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో టెస్టులో రవీంద్ర జడేజా సెంచరీ చేయడంతోపాటు ఈ మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు.