Home » Tag » India team
అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భారత్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. సెమీస్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 13 ఏళ్ళ బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పింక్ బాల్ టెస్ట్ కోసం భారత ఓపెనింగ్ జోడీపై సందిగ్ధత కొనసాగుతుండగా... కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ టీమ్ మేనేజ్ మెంట్ కు తలనొప్పిగా మారింది. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్ గా రోహిత్ శర్మ కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు.
ఆస్ట్రేలియా టూర్ లో రెండో సవాల్ కు భారత్ రెడీ అవుతోంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ పింక్ బాల్ టెస్ట్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సంజూ మరోసారి విద్వాంకర ఇన్నింగ్స్ కు తెరలేపాడు.
ఐపీఎల్ మెగావేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. ఆదివారం, సోమవారం సౌదీ అరేబియా సిటీ జెడ్డా వేదికగా మెగా ఆక్షన్ జరగనుండగా.. ఇప్పటికే 574 మంది ప్లేయర్స్ ను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సారి వేలంలోకి పలువురు స్టార్ ప్లేయర్స్ కూడా వచ్చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారత్ యువస్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కౌంటీల్లో అదరగొడుతున్నాడు. ఇంగ్లీష్ గడ్డపై తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తున్నాడు. జాతీయ జట్టుకు దూరమైన చాహల్ ప్రస్తుతం కౌంటీల్లో నార్తాంప్టన్ షైర్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.