Home » Tag » India vs bangladesh
ఎంతో ప్రతిభ ఉన్న క్రికెటర్... బీసీసీఐ అతనికి అన్యాయం చేస్తోంది... దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించినా సెలక్టర్లు పట్టించుకోవడం లేదు.. ఇదీ కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ కెరీర్ తొలినాళ్ళలో అభిమానుల ఆవేదనతో కలిపిన ఆగ్రహం... క్రమంగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి... కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో సంజూ విఫలమయ్యాడు.
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలుపుకోవడం అంత కంటే కష్టం... వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటితేనే జట్టులో ప్లేస్ ఉంటుంది. ఈ విషయంలో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కాస్త వ్యూహాత్మకంగానే ముందున్నట్టు చెప్పొచ్చు.
భారత్,బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ కు ఆదివారం నుంచే తెరలేవనుంది. గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగబోతోంది. ఇరు జట్లు ఇప్పటికే నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ యువ జట్టు ఘనవిజయంతో సిరీస్ ఆరంభించాలని భావిస్తోంది.
కాన్పూర్ టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. వర్షంతో మూడు రోజుల ఆట జరగకున్నా నాలుగోరోజు టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. బంగ్లాదేశ్ ను 233 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు.
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్ట్ డ్రాగా ముగియడం ఇక లాంఛనమే..మూడో రోజు ఆట కూడా ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. వర్షం లేకున్నా.. మైదానంలోని ఓవైపు ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారడంతో పలుమార్లు పరిశీలించిన అంపైర్లు చివరకు మూడో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
భారత్ , బంగ్లాదేశ్ రెండో టెస్టును వరుణుడు వెంటాడుతున్నాడు. మొదటి రోజు 34 ఓవర్ల ఆట మాత్రమే జరగ్గా... రెండోరోజు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. 11 గంటలకు వర్షం తగ్గుముఖం పట్టినా సిబ్బంది కవర్లు తీసేలోపే మరోసారి వరుణుడు రీఎంట్రీ ఇచ్చాడు.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ మూడు టీ ట్వంటీల సిరీస్ కూడా ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు పలువురు స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని ఫార్మాట్ లలో ఆడుతున్న గిల్, పంత్ వంటి ప్లేయర్స్ ను బంగ్లాతో టీ ట్వంటీలకు ఎంపిక చేయకపోవచ్చు.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను భారత్ ఘనవిజయంతో ఆరంభించింది. చెపాక్ లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంగ్లాను చిత్తు చేసింది. ఈ విజయంతో కోచ్ గా టెస్టుల్లోనూ శుభారంభం చేసిన గౌతమ్ గంభీర్ మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఇన్ స్టా గ్రామ్ లో ఆరే పదాలతో పోస్ట్ పెట్టాడు.
సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. చెన్నై టెస్టులో విఫలమైన కోహ్లీ ఇప్పుడు కాన్పూర్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో అతను 37 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తాడు.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో తెలిసిందే... ఆటలోనే కాదు ప్రత్యర్థుల స్లెడ్జింగ్ కు ధీటుగా బదులిస్తుంటాడు... ఒక్కోసారి వారిపై సెటైర్లు కూడా వేస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.