Home » Tag » India vs England
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు, రెండు ఓటమి, ఒక డ్రాతో 59.52 పాయింట్ల శాతంతో సెకెండ్ ప్లేస్‌లో నిలిచింది.
రాంఛీ టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్ కారణంగా బుమ్రాకు నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
భారత బౌలర్ల జోరుకు, జైస్వాల్ విధ్వంసకర సెంచరీ కూడా తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. మూడో రోజు లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జోరుకు అడ్డుకట్ట వేశారు.
వరుసగా ఇన్‌స్వింగర్, ఔట్ స్వింగర్స్ విసురుతూ ఇంగ్లీష్ బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేశాడు. సీనియర్ బ్యాటర్లు స్టోక్స్, రూట్, బెయిర్ స్టో కూడా బూమ్రా ట్రాప్‌లో చిక్కక తప్పలేదు. అసలు బూమ్రా విసురుతోంది బంతులేనా లేకపోతే బుల్లెట్లా అన్న రీతిలో ఈ పేసర్ బౌలింగ్ సాగింది.
రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన భారత్.. ఆట ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా, 28 పరుగులు చేసింది. దీంతో ఇండియాకు 171 పరుగుల ఆధిక్యం లభించింది. జైశ్వాల్ 15 పరుగులతో, రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో రోజు ఆటలోనూ యశస్వీ జైస్వాల్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. జైశ్వాల్.. దూకుడుగా ఆడుతూ డబుల్ సెంచరీ సాధించాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ, సిక్సర్ వరుసగా బాది ద్విశతకాన్ని అందుకున్నాడు.
రోహిత్, గిల్, అయ్యర్ త్వరగానే ఔటైనా.. జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రోహిత్‌తో కలిసి 40 పరుగులు, గిల్‌తో 49, శ్రేయాస్ అయ్యర్‌తో 90 పరుగులు, రజత్ పటిదార్‌తో 70 పరుగులు చేసి, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
విశాఖలో మన బ్యాటర్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అలాగే శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా వైఫల్యాల బాట వీడకుంటే కష్టమేనని చెప్పొచ్చు.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 190 పరుగుల భారీ ఆధిక్యం సాధించినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా, ఆలౌటై మ్యాచ్ కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకే ఆలౌటైంది.
ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 23 పరుగులకే ఔటయ్యాడు. ఏకాగ్రత కోల్పోయి, గిల్ ఆ షాట్ ఆడినట్లు కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. అంతకుముందే గిల్‌కు లైఫ్ వచ్చినా దానిని యూజ్ చేసుకోలేకపోయాడు.