Home » Tag » Indian Cricketer
శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. కొత్త కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కొత్త శకం మొదలవుతుందనే చెప్పాలి.
టీమిండియా (Team India) మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ (Manoj Tiwary) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) వల్లనే తన కెరీర్ నాశనమైందన్నాడు. 2011లో భారత్ తరఫున సెంచరీ చేసిన తర్వాత కూడా తనను తుది జట్టు నుంచి తప్పించారని గుర్తు చేసుకున్నాడు.
ఏ ఫార్మాట్ లోనైనా ఆల్ రౌండర్ కు చాలా గుర్తింపు ఉంటుంది. ఈ కేటగిరీలో భారత్ నుంచి చాలా కాలంగా అదరగొడుతున్నది ఎవరంటే రవీంద్ర జడేజా అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అన్ని ఫార్మాట్ లలోనూ దుమ్మురేపుతున్న జడేజా టెస్టుల్లో టాప్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు.
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఈ మ్యాచ్ కు ముందు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఇంగ్లాండ్(England)తో ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు కోహ్లీ దూరం కావడంతో పెద్ద చర్చే జరిగింది. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని బీసీసీఐ (BCCI) ప్రకటించడం, కోహ్లీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదన్న వార్తలు వచ్చాయి. అవేమీ నిజం కాదని తెలుస్తోంది. విరాట్ కోహ్లి దూరం కావడానికి గల కారణం వెల్లడైంది.
విశాఖ తీరంలో.. భారత్ - ఇంగ్లండ్ టెస్టు మ్యాస్.. అభిమానుల సందడి
రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) మధ్య కోల్డ్ వార్ (Cold War) ఉందంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. రెండు గ్రూపులుగా జట్టును మేనేజ్ చేస్తున్నారన్న కథనాలు కూడా షికారు చేశాయి. అయితే కొన్ని రోజులుగా వీటికి ఫుల్ స్టాప్ పడుతూ వస్తోంది.
రంజీ సీజన్లో పరుగుల వరద పారుతోంది. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో పలువురు బ్యాటర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ రంజీ జట్టు ఆటగాడు తన్మయ్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. అరుణాచల్‌ప్రదేశ్‌తో జరుగుతు మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.
భారత క్రికెట్లో (Indian Cricketer) అన్నదమ్ములు క్రికెటర్లుగా ఉండడం కొత్తేమీ కాదు. తాజాగా మరోసారి ఇద్దరు సోదరులు దుమ్మురేపుతున్నారు. వారే సర్ఫ్రాజ్ ఖాన్, ముషీర్ ఖాన్... భారత్ ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సర్ఫ్రాజ్ ఖాన్ ఇంగ్లండ్ లయన్స్‌పై పరుగుల వరద పారిస్తున్నాడు.
వరల్డ్ క్రికెట్ (World Cricket) లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ విరాట్ కోహ్లీ (Virat Kohli) .. క్రికెట్ గాడ్ సచిన్ (Cricket God Sachin) రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా టీ ట్వంటీ (T20 Cricket) క్రికెట్ లో కోహ్లీ మరో అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. కోహ్లి ఆరు పరుగులు సాధిస్తే.. టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.