Home » Tag » Indian Premier League
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 17వా సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ చేర్ జట్ల పై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ప్రస్తుతానికి 8 జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ (World Cup) కోసం భారత క్రికెటర్లు ఐపీఎల్ (IPL 2024) మధ్యలోనే అమెరికాకు వెళ్ళిపోనున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 17వ సీజన్ నిర్వహణ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ సెకెండ్ ఫేజ్ మ్యాచ్‌ల వేదికను మార్చనున్నట్లు సమాచారం.దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) విషయంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండు సార్లు ఐపీఎల్ (IPL) నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ను రెండు ఎడిషన్లు పాటు నిర్వహిస్తే బాగుంటుందని గతంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సూచించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో కొందరు ఆటగాళ్లు గాయపడడం ఇప్పుడు ఫ్రాంచైజీలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పటిష్టమైన జట్టును రంగంలోకి దించాలని పట్టుదలతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు.
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్, టీమిండియా (Team India) దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) కి అరుదైన గౌరవడం దక్కింది. ఇండియన ప్రీమియర్ లీగ్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీమ్ కెప్టెన్‌గా మిస్టర్ కూల్ ఎంపికయ్యాడు. పదిహేను మంది సభ్యులతో కూడిన అత్యుత్తమ జట్టుకు నాయకుడిగా అవకాశం దక్కించుకున్నాడు.
ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాలా మంది యువ ఆటగాళ్ల లైఫ్ ను మార్చేసింది. టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా చేసింది. అదే సమయంలో వారి ఫైనాన్షియల్ స్టేటస్ ను కూడా మార్చింది. ఇటీవల ముగిసిన వేలంలోనూ పలువురు యువ ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టారు.
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ 2023 ముగియగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ సందడి మొదలైంది. ఐపీఎల్ 2024 మినీ వేలానికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే బీసీసీఐ సిద్ధం చేసింది. ముంబై వేదికగా డిసెంబర్ 19న మినీ వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్లేటెర్స్ ట్రేడింగ్ విండోను ఓపెన్ చేసిన బీసీసీఐ.. రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించేందుకు నవంబర్ 26ను డెడ్‌లైన్‌గా విధించింది.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. ఇప్పుడు నితీష్ రానా జట్టుతో పోరుకు సిద్ధమైంది. స్ట్రాంగ్ టీమ్‌గా కనబడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇదే వేదిక మీద చిత్తు చేసిన కోల్‌కతా.. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని చూస్తుంది.
కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే మ్యాచులో మార్క్రమ్ ఆధ్వర్యంలోని ఎస్ఆర్హెచ్ విజయం సాధించాలంటే ముగ్గురు కేకేఆర్ ఆటగాళ్లను కీలకంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ముందుగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఇరగదీస్తున్న వెంకటేష్ అయ్యర్ ఒకడు.