Home » Tag » Indian Prime Minister
కొంతకాలంగా వీక్ అవుతూ వస్తున్న భారత్, మాల్దీవుల బంధం.. ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ప్రధాని మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లడం.. అక్కడ ఆయన వ్యాఖ్యలపై.. మాల్దీవుల మంత్రి కౌంటర్ వేశారు. దీంతో కొత్త వివాదం మొదలైంది. అది కాస్త చినికిచినికి గాలివానలా తయారవుతోంది. మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయ్. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్ అంటూ నెటిజన్లు మారాయి. ఈ మధ్య ప్రధాని మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లారు. అక్కడి పర్యాటక రంగాన్ని కొత్త జోష్ నింపేలా నాలుగు మాటాలు మాట్లాడారు. ముఖ్యంగా స్నార్కెలింగ్.. అంటే సముద్ర అడుగు భాగంలో ఈత కొట్టే సాహనం గురించి ప్రత్యేకంగ ప్రస్తావించారు.
హమాస్ - ఇజ్రాయెల్ యుద్దం ధాటికి గాజా నలిగిపోతోంది. తాజాగా స్థానిక అల్అహ్లి ఆసుపత్రి వద్ద చోటు చేసుకున్న బాంబు పేలుడు ఘటనలో దాదాపు వందల మంది ప్రాణాలు విడిచారు. దీనిపై పరస్పరం ఇరు దేశాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడి కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు.
ప్రపంచశాంతి,,దేశాల భద్రత..సౌభ్రాతృత్వం.. ఈ మూడింటిని సాధించడమే లక్ష్యంగా 78 ఏళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి అవతరించింది. యుద్ధాలు, వినాశనాలు, దేశాల మధ్య కలహాలు..దురాక్రమణలు ఇలా ప్రపంచదేశాల ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేసి ప్రపంచాన్ని ఒక శాంతి కేంద్రంగా మార్చే సంకల్పంతో ఐక్యరాజ్య సమితి పురుడు పోసుకుంది.