Home » Tag » Indigo
ఇండియన్ ఎయిర్ లైన్స్ వెన్నులో ఏదో తెలియని భయం... ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ప్రయాణంగా పేరొందిన గగనతల ప్రయాణం అంటే ప్రజల్లో తెలియని ఆందోళన. బుధవారం అంటే అక్టోబర్ 16న ఒక్క రోజే ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
విమానం అనగానే కొందరికి వింతైన అనుభూతి కలుగుతుంది. మరికొందరికి ప్రయాణం సౌకర్యంతో పాటూ త్వరగా గమ్యస్థానాన్ని చేరేందుకు దోహదపడుతుంది. అందుకే చాలా మంది ఫ్లైట్ జర్నీని ఎంచుకుంటారు. అయితే తాజాగా ఇండిగో విమానాల్లో ప్రయాణం చేస్తున్నవారికి చేదు అనుభవం ఎదురైంది. అదికూడా మూడుచోట్ల ఇలాంటి సమస్యలు తలెత్తడం కాస్త అసౌకర్యానికి గురిచేసింది.
అవకాశాలు వచ్చినప్పుడే వాటిని అందిపుచ్చుకోవాలి. మార్కెట్లో రారాజుగా మారాలంటే ప్రత్యర్థి సంస్థలను దెబ్బతీయాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థులు ఎదుర్కొంటున్న సంక్షోభాలను మనం అవకాశంగా మార్చుకుంటే సరిపోతుంది. అవతలివాళ్లు ఎదుర్కొంటున్న సంక్షోభాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగితే ఎలాంటి రంగంలోనైనా నెంబర్‌వన్ స్థానానికి ఎదిగిపోవచ్చు.
మీరు లక్షాధికారి కావాలనుకుంటున్నారా ? అయితే వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఒక ఎయిర్‌లైన్ సంస్థను స్థాపించండి.! విమానయాన రంగంపై ఇంతకు మించిన పెద్ద సెటైర్ ఇంకేమైనా ఉంటుందా ? ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ అంటేనే పెద్ద లాస్ అని విమానాలు నడిపి డబ్బులు సంపాదించాలనుకుంటే కోట్లకు పడగలెత్తిన వాళ్లు కూడా లక్షాధికారులుగా మారిపోతారని బ్రిటన్ వ్యాపార దిగ్గజం రిచర్డ్ బ్రాన్సన్ ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఆయన మాటలు గుర్తు చేసుకోవడానికి కారణం మనదేశంలో మరో విమాన సంస్థ చాప చుట్టేసింది. ఇక విమానాలు తిప్పడం మా వల్ల కాదంటూ గో ఫస్ట్ సంస్థ దివాళా పిటిషన్ దాఖలు చేయడం దేశీయ విమానయాన రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మరోసారి చర్చకు పెట్టింది. ప్రముఖ వ్యాపార సంస్థ వాడియా గ్రూప్ నిర్వహిస్తున్న గో ఫస్ట్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు స్వచ్చందంగా దివాళా పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు దేశీయ విమానయాన రంగంలో కూడా కుదుపు మొదలయ్యింది.