Home » Tag » Innaguration
హైదరాబాద్ దుర్గం చెరువులో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గజ్వేల్ విజయ లక్ష్మితో పాటూ స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. రకరకాల మ్యూజిక్ లకు నీటి ధాలర విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 వరకూ ఈ ఫౌంటెన్ స్థానికులు వీక్షించేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపారు అధికారులు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఉస్మానియా యూనివర్సిటీలో లైటింగ్ షో ఏర్పాటు చేశారు. ఈనెల 27న టూరిజం డే సందర్బంగా వీటిని ప్రదర్శిస్తారు.
ఉస్మానియా యూనివర్సిటీలో లైటింగ్ షో ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సుమారు రూ. 12 కోట్టతో ఈ పనులను చేపట్టారు. ఈనెల 27న ప్రపంచ టూరిజం దినోత్సవం సందర్భంగా లైటింగ్ షోతో పాటూ లేజర్ షో, మ్యూజిక్ ఫౌంటేన్ ప్రదర్శిస్తామన్నారు.
బంజారాహిల్స్ లో ఛాయోస్ అనే టీ షాపును ప్రారంభించిన సినిమా తారలు. ఇక్కడ 80వేల వెరైటీల టీ రుచులు అందుబాటులో ఉంటాయంటున్నారు నిర్వాహకులు.
వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నరేంద్రమోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఇది అండమాన్ నికోబార్ ద్వీపంలో ఉంది. రోజుకు లక్షమంది ప్రయాణీకులు ప్రయాణం చేసే సామర్థాన్ని కలిగి ఉండేలా దీనిని నిర్మించారు. ఎటు చూసినా పచ్చదనం, దేదీప్యమానంగా వెలుగొందే జిగేల్ కాంతుతే దర్శనమిస్తాయి. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించారు.
హైదరాబాద్ : ఉప్పల్ రింగ్ రోడ్డులో పాదచారుల కష్టాలకు చెక్ చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం స్కైవాక్ ఏర్పాటు చేసింది. దీనిని సోమవారం మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మినిస్టర్ కేటీఆర్ హాజరయ్యారు. దాదాపు రూ. 25 కోట్లతో స్కైవాక్ బ్రిడ్జి నిర్మించారు. ఎక్కడా క్రింద నుంచి ట్రాఫిక్ నడుమ రోడ్డు దాటే అవసరం లేకుండా బ్రిడ్జ్ పై నుంచి వెళ్లొచ్చు. ఈ స్కై వాక్ పొడవు 665 మీటర్లు.. వెడల్పు 4 మీటర్లు కాగా 6 మీటర్ల ఎత్తులో దీనిని కట్టడం జరిగింది. బస్ స్టాప్, మోట్రోకు అనుసంధానం చేస్తూ ఇందులో మొత్తం 8 లిఫ్టులు, 4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యం ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థతో పాటూ పలు పీఠాధిపతులు హాజరయ్యారు. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బ్రాహ్మణుల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సదరన్ భవన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని వరాలు గుప్పించారు.