Home » Tag » Inner Ring Road scam
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో ఏ14గా చేర్చిన సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 4న ఉదయం పది గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించింది. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. అక్కడ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో నారా లోకేష్ ఉంటున్నారు.
తనను ఈ కేసులో అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్‌ను ఏ14గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌ను ఏ14గా చేర్చిన సీఐడీ.. మెమోలో కీలక అంశాలు రాసుకొచ్చింది. హెరిటేజ్ సంస్థకు లాభం చేకూరేలా లోకేశ్ నిర్ణయాలు తీసుకున్నారని సీఐడీ అంటోంది. హెరిటేజ్ సంస్థలో ఈడీగా నారా బ్రహ్మణి, VC, MDగా నారా భువనేశ్వరి ఉన్నారు.
ఈనెల 29 నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్న లోకేశ్‌కు షాక్ ఇచ్చేలా అనూహ్యంగా అరెస్టు చేయాలనే వ్యూహంతో జగన్ సర్కారు ఉందని వినికిడి. యువగళం పాదయాత్రను ప్రారంభించడానికి ముందే లోకేశ్‌ను అరెస్టు చేస్తే.. ఆయనకు ప్రజా సానుభూతి దక్కకుండా చేయొచ్చని ప్లాన్ చేస్తోంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేశ్‌ను అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా సాగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేశ్ మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో లోకేశ్‌ను ఏ14 నిందితుడిగా నమోదు చేసింది సీఐడీ.