Home » Tag » IPL 2023
గుజరాత్ (Gujarat) తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓడిపోయినా ధోనీ బ్యాటింగ్ చివర్లో ఫాన్స్ కి మజా ఇచ్చింది.ఆఖర్లో బ్యాటింగ్ కి వచ్చిన ధోనీ (Dhoni) సిక్సర్లతో అలరించి ఓటమి అంతరాన్ని తగ్గించాడు.
ఈ ఏడాది ఐపీఎల్ ముందు వరకు కూడా శుబ్ మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుస పెట్టి సెంచరీలు సాధించాడు. ఇక ఐపీఎల్ లోనూ రెచ్చిపోయాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు.
ఐపీఎల్ 2023 సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన ఐపీఎల్ జట్టుగా నిలిచింది. 'హౌలిహాన్ లోకీ' నివేదిక ప్రకారం ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 3.2 బిలియన్ల అమెరికా డాలర్లు. ఐపీఎల్ 2022 సీజన్‌తో పోల్చితే ఇది 80 శాతం ఎక్కువ.
జూలై 24 నుంచి ప్రారంభం కానున్న దేవధర్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఢిల్లీ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ నితీష్ రాణా సారధ్యం వహించనున్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్ పంజాబ్ కింగ్స్‌కు నిరాశను అందించింది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కానీ పంజాబ్ కింగ్స్ యువ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పెద్ద షాట్లు సైతం అలవోకగా కొట్టాడు.
యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయడానికి ఇతర కారణాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఫిట్నెస్ పెంచుకోవాలని, బరువు తగ్గాలని సూచించారు. మైదానం బయట, లోపలా ప్రవర్తన తీరు మార్చుకోవాలని అంటున్నారు. కేవలం బ్యాటింగ్ ఫిట్నెస్ ఉంటే సరిపోదని వెల్లడించారు.
గతేడాది నుంచి ఐపీఎల్లో జరుగుతున్న ప్రధాన చర్చల్లో ధోనీ, జడేజా గొడవ కూడా ఒకటి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా 2022 సీజన్ ఆరంభానికి ముందే జడేజాను ప్రకటించారు. కానీ అతని కెప్టెన్సీలో జట్టు చాలా పేలవ ప్రదర్శన చేసింది. దీంతో మళ్లీ కెప్టెన్సీ బాధ్యతను ధోనీ తీసుకోవాల్సి వచ్చింది.
ఐపీఎల్ 2023 సీజన్ లో గుజరాత్ టైనాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు చేరాయి. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్. చివరి నిమిషం వరకూ పోరాడి గెలిచిన చెన్నై. రన్నరప్ గా నిలిచిన గుజరాత్.
ఐపీఎల్లో ముంబై-చెన్నై అభిమానుల కామన్ ఫేవరెట్. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు ఐపీఎస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 13 ఏళ్లు ఐపీఎల్లో అభిమానులను అలరించిన రాయుడు ఇప్పుడు రిటైర్ అవుతున్నాడంటే అటు ముంబై ఇటు చెన్నై అభిమానుల మనసుల్లో ఏదో తెలియని బాధ.
అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. చెన్నై, గుజరాత్ జట్ల మధ్య తుదిపోరును సోమవారానికి వాయిదా వేశారు. దీంతో విజేత ఎవరూ అనే దానిపై క్రికెట్ అభిమానుల్లో ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతుంది. ఈరోజైనా వరుణుడు కరుణిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.