Home » Tag » IRR Case
ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయకుండా.. ఆయన తరఫు లాయర్లు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది. అంతకుముందు గత బుధవారం కూడా ఈ కేసు విచారణ సాగింది. ఈ కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దంటూ ఏసీబీని ఆదేశించింది.
ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు రిమాండ్ వ్యవహారం ఇంకెన్నాళ్లు నడుస్తుందనేది తేలడం లేదు. ప్రస్తుతానికి స్కిల్ డెవలప్ మ్ంట్ కేసు విచారణ అటు సుప్రీంకోర్టు, ఇటు ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉంది. మరోవైపు కొత్తగా అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో విచారణకు పీటీ వారెంట్ పిటిషన్లు, వీటిపై బెయిల్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ విచారణలు ముగిసేదెప్పుడు..? కేసులు నుంచి బయటపడేదెప్పుడు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సెప్టెంబర్ 9వ తేదీన సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా 14 రోజులు రిమాండ్ అనగా సెప్టెంబర్ 24 వరకూ ఆదేశించింది. ఆతరువాత మరో రెండు రోజులు కస్టడీ నేపథ్యంలో రిమాండ్ పొడిగించింది. ఈ లోపు మరిన్ని కేసులు వెంటాడడంతో అక్టోబర్ 5 వరకూ జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే రేపటితో కోర్టు ఇచ్చిన రిమాండ్ గడువు ముగియనుంది. ఇలాంటి పరిస్థితుల ఏం జరుగుతుందా అని ఉత్కంఠ అందరిలో నెలకొంది.