Home » Tag » isro
ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా నింగిలోకి మోసుకెళ్లింది. ఏపీ, శ్రీహరికోటలోని సతీష ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 05:35 గంటలకు జీఎస్ఎల్వీ నౌకను ఇస్రో అంతరిక్షంలోకి ప్రయోగించింది.
సూర్యుడి గురించి పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో తెలిపింది. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లంగ్రాజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ చేరుకుందని ఇస్రో వెల్లడించింది.
మానవసహిత వ్యోమగాముల ద్వారా అంతరిక్ష పరిశోధనలు జరిపేందుకు మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు కావాలని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
మరో పదేళ్లలో భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయులు అడుగుపెట్టేలా లక్ష్యం పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. దీని కోసం ఇప్పటి నుంచే పరిశోధనలు మొదలుపెట్టాలంటూ సూచించారు.
చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపి, విజయవంతం చేసింది ఇస్రో. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. దీంతో అమెరికాసహా ఇతర దేశాలు భారతీయ సాంకేతికతను చూసి ఆశ్చర్యపోయాయి. అయితే, ఈ సాంకేతికతే నచ్చిన అమెరికా ఈ టెక్నాలజీని తమతో పంచుకోవాలని అడిగినట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.
ఇస్రో కేంద్రంపై రోజూ వందల సంఖ్యలో సైబర్ ఎటాక్స్ జరుగుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైన తరువాత ఈ ఎటాక్స్ ఇంకా పెరిగాయట. ఏదో ఒకలా ఇస్రో డేటాబేస్ను హ్యాక్ చేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయట.
భారత తొలి మానవసహిత అంతరిక్ష మిషన్ 'గగన్యాన్' కీలక పరీక్షకు సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది. మానవరహిత ఫ్లైట్ టెస్టులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
చంద్రయాన్-3 అధ్యాయం ఇక ముగిసినట్టే. విక్రమ్ నుంచి ఇక మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. ఇది మేం చెప్తున్న మాట కాదు. స్వయంగా ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చెప్పిన మాట. చంద్రుడి సౌత్ పోల్లో 14 రోజులు పరిశోధనలు జరిపిన తరువాత విక్రమ్, ప్రగ్యాన్ను స్లీప్మోడ్లోకి పంపేశారు శాస్త్రవేత్తలు.
చంద్రుడిపైకి పంపిన ల్యాండర్, రోవర్ ని ఈనెల 4వ తేదీ నిద్రాణ స్థితిలోకి పంపింది ఇస్రో. తాజాగా అక్కడ సూర్యకిరణాలు ప్రసరించడంతో తిరిగి యాక్టివ్ చేయాలని తీవ్రంగా శ్రమిస్తోంది.
చంద్రుడి దక్షిన ధృవంపై స్లీప్ మోడ్ లో ఉన్న ప్రగ్యాన్, విక్రమ్ లు తిరిగి పనిచేస్తాయా లేదా అంటే మరో రెండు రోజులు వేచి చూడాలి.