Home » Tag » IT Companies
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో పరిస్థితులు తలకిందులవుతున్నాయి. సాఫ్ట్ వేర్ (Software) ఉద్యోగం అంటేనే గ్యారెంటీ లేని జాబ్స్ అయ్యాయి. ఎప్పుడు ఐటీ (IT) కంపెనీ పైకి లేస్తుందో.. ఎప్పుడు కంపెనీ కుదెలు అవుతుందో అని ఐటీ ఉద్యోగులు బిక్కు బిక్కు మంటున్నారు. ఏ క్షణంలో ఉద్యోగం ఊడుతుందో తెలియక వణికిపోతున్నారు.
ఉద్యోగాల్లో మళ్ళీ కోత పెట్టింది టెక్ దిగ్గజం గూగుల్. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతపై కాస్త వెనక్కి తగ్గినా ... గూగుల్ మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తోంది. ఈమధ్యే సరిగా పనిచేయడం లేదనీ, ప్రవర్తన సరిగా లేదంటూ 50 మందిని ఇంటికి పంపింది గూగుల్. ఇది జరిగి కొన్ని వారాలు కాకముందే మళ్ళీ జాబ్ లే ఆఫ్స్ ప్రకటించింది.
భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికా దిగ్గజ సంస్థలు కూడా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులపై వేటు వేసింది.
ఐటీ అంటేనే ఇన్ కం పెరిగే ఉద్యోగం అని ఒకప్పుడు భావించే వారు. కానీ మన్నటి వరకూ పరిస్థితులు వీటికి భిన్నగా కనిపించాయి. ఐటీ అంటే ఇన్ ఆర్ అవుట్ అనేలా మారిపోయాయి. దీనికి ప్రదాన కారణం అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఎదురైన ఆర్థిక పరిస్థితులు. అయితే తాజాగా కొన్ని ఐటీ కంపెనీలు ఇంటర్న్ షిప్ పేరిట తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు చూస్తున్నాయి. దీంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. వీటి గురించి మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.