Home » Tag » IT Raids
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ (MLC)కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడి సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో నేడు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఐటీ అధికారులు, జిల్లా పోలీసులు, ఈసీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా ఖమ్మం, పెద్దపల్లిలో మొత్తం తనిఖీల్లో రూ. 11 కోట్లకు పైగా నగదపట్టుబడింది.
ఎన్నికల వేళ వరుస ఐటీ దాడులు రాజకీయ నేతలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఇప్పటికే పలు కాంగ్రెస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు జరగగా.. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. తాండూరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి.. పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. తాండూరు, హైదరాబాద్లో ఉన్న రోహిత్ ఇళ్లపై దాడులు చేశారు ఐటీ అధికారులు. రోహిత్ నుంచి 20 లక్షలు, రోహిత్ తమ్ముడు రితీష్ నుంచి 24 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
బీజేపీ - బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఆయన బహిరంగ లేఖను రిలీజ్ చేశారు.
పలువురు రాజకీయ నేతలు, వారి సన్నిహితుల ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులపై దాడులు జరిగాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరి బంధువు అయిన ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.
తెలంగాణ ఎన్నికల వేళ మరోసారి హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోలింగ్ మరో 17 రోజులు మాత్రమే సమయం ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
కాంగ్రెస్కు చెందిన తుమ్మల నాగేశ్వర రావు, బడంగ్పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి నివాసంతోపాటు పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపై కూడా వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. అయితే, కాంగ్రెస్ నేతలపై మాత్రమే దాడులు జరుగుతుండటంపై ఆ పార్టీ నేతలు కేంద్ర సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో.. ఆఫీసుల్లో ఏక కాలంలో ఐటీ రైట్స్ కలకలం రేపుతున్నాయి.
మొన్నటిదాకా ఐటీ రైడ్స్, ఈడీ దాడులతో బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ల ఇళ్ళల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. అసలే తెలంగాణలో కాంగ్రెస్ మంచి పీక్ స్టేజ్లో ఉంది. బీఆర్ఎస్తో నువ్వా నేనా అంటూ రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్.
రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలే టార్గెట్గా కేంద్ర సంస్థలు దాడులు చేస్తున్నాయని ఆయా పార్టీలు విమర్శిస్తున్నాయి. కొంతకాలం క్రితం వరకు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా మరోసారి ఈ దాడులు జరగడంతో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి.