Home » Tag » Jadeja
కొత్త ఏడాదిలో టీమిండియా ఫ్యాన్స్ కు షాక్ తగలబోతోందా... భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా... అంటే అవుననే అనుమానాలు మొదలయ్యాయి.
భారత క్రికెట్ లో రిటైర్మెంట్ల పర్వం ఇప్పుడే మొదలైంది. గబ్బా టెస్ట్ చివరిరోజు రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా వీడ్కోలు పలకడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పెర్త్ టెస్టుతోనే అతను రిటైర్మెంట్ ఇచ్చేశాడని, తానే ఆపానంటూ కెప్టెన్ రోహిత్ చెప్పినప్పటకీ... అశ్విన్ వీడ్కోలు మాత్రం అందరికీ షాకే...
ఆసీస్ తో మూడో టెస్టులో భారత్ ను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించిన ముగ్గురిలో రవీంద్ర జడేజా ఒకడు... చాలా రోజుల తర్వాత లోయర్ ఆర్డర్ లో బ్యాట్ కు పని చెప్పి హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా జడ్డూ అరుదైన రికార్డు అందుకున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి మొదలుకానుంది. హ్యాట్రిక్ కోసం టీమిండియా ఉవ్విళ్ళూరుతుంటే... ఎట్టపరిస్థితుల్లోనూ ఈ సారి కప్ గెలవాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. తొలిసారి ఆస్ట్రేలియా జట్టు టీమిండియాను చూసి భయపడుతోంది.
బెంగళూరు టెస్టులో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే గిల్ మెడనొప్పితో దూరమవగా... మ్యాచ్ ఆడుతూ రిషబ్ పంత్ గాయపడ్డాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తుండగా పంత్ మోకాలికి బాల్ బలంగా తాకింది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడాడు.
కాన్పూర్ టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. వర్షంతో మూడు రోజుల ఆట జరగకున్నా నాలుగోరోజు టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. బంగ్లాదేశ్ ను 233 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్‌ల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన జడేజా.. మ్యాచ్ మొత్తంలో ఐదు వికెట్లు తీశాడు.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముంగిట భారత క్రికెటర్లను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు. జడ్డూ మరో 6 వికెట్లు తీస్తే ఈ ఘనత సాధిస్తాడు.
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. క్రికెట్ కెరీర్ లో రిటైర్మెంట్ కు చేరువలో ఉన్న జడ్డూ బీజేపీలో చేరాడు. బిజెపీలో చేరిన ఫోటోలను, మెంబర్ షిప్ కార్డును జడేజా భార్య రివాబా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా భారత క్రికెట్ జట్టును సిద్ధం చేసేలా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ అడుగులు వేస్తున్నాడు. బాధ్యతలు తీసుకున్న తొలి సిరీస్ లోనే జట్టు ఎంపికలో తన ముద్ర ఉండేలా చూసుకున్నాడు.