Home » Tag » JAI SRI RAM
అయోధ్య (Ayodhya Ram Mandir) లో బాలక్ రామ్ (Bala Rama) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగినప్పటి నుంచీ భక్తుల పోటెత్తుతున్నారు. రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరిగిపోతోంది. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25 లక్షల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. 11 కోట్ల రూపాయల దాకా హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఎవరి గురించైనా పది, ఇరవై, వంద.. రెండొందలు, మూడొందల ఏళ్ల వరకే చెప్పుకుంటామేమో. కానీ, రాముడి గురించి ఏడువేల ఏళ్ల నుంచి ఈ జాతి తమ ప్రతినిధిగా చెప్పుకుంటోంది. మర్యాద పురుషోత్తముడు అనే పేరుతో పిలుచుకుంటోంది.
అయోధ్యలో (#Aydhya Rama Mandir) ఈనెల 22న జరిగే శ్రీరామచంద్రుల వారి ప్రాణప్రతిష్ట కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు వెయ్యికళ్ళతో చూస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు దేశ, విదేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జనవరి 22నాడు అయోధ్యలోని మందిరంలో సీతారామచంద్రుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు పండితులు. ఆ రోజు మృగశిర నక్షత్రం ఉంది. రాముడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు. మానవ జన్మను ఉద్దరించడానికి విష్ణు భగవానుడు.. రాముడి అవతారంలో భూమ్మీదకు వచ్చారన్నది అందరికీ తెలిసిందే.