Home » Tag » Jail
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి 9వ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచేందుకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.
రాజకీయాల్లో సెంటిమెంట్లు కామన్.. ఐతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ (Politics) లో కొత్త సెంటిమెంట్ స్టార్ట్ అయింది. అదే.. జైలుకెళ్తే సీఎం అవుతారని ! తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయ్.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ.... జనంలో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతుంది. ఈసారి ఏపీలో ఎవరి ప్రభుత్వం రాబోతుంది.
తాను జైలులో ఉన్నప్పటికీ పాలన కొనసాగిస్తానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అంతేకాదు.. అన్నట్లుగానే.. కస్టడీ నుంచి ఇటీవల అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ తాగునీటి సమస్య గురించి ఆదేశాలిచ్చారు. దీనిపైనే ఈడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు లోపలికి వెళ్ళే ముందు కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదనీ.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని కామెంట్ చేశారు కవిత. తాత్కాలికంగా తనను జైల్లో పెట్టొచ్చు కానీ.. క్లీన్‌గా బయటకొస్తానన్నారు.
కోడి కత్తి కేసులో నాలుగేళ్లకు పైగా జైల్లో ఉన్న నిందితుడు శ్రీనివాస్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్.. విశాఖ జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు.. దాంతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైమ్ లో డూప్లికేట్, డబుల్ ఓట్ల వ్యవహారం వివాదస్పదంగా మారింది. వైసీపీ, టీడీపీ పరస్పరం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో.. ఈసీ సీరియస్ గా స్పందించింది. డూప్లికేట్, డబుల్ ఓట్లు ఉంటే కేసులు పెడతామనీ.. అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.
పగ, ప్రతీకారం, పట్టుదల.. వీటి బేస్‌గా నాయకులు ఎన్నికల్లో నిలబడి మంత్రులు, ముఖ్యమంత్రులుగా మారుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జగన్, రేవంత్ రెడ్డి ఉదంతాలను చూసిన జనం ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నారు. జైలుకెళ్ళి వస్తే ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నారు.
ఇక నుంచి డీప్‌ఫేక్ వీడియోలు చేస్తే జైలుకే..
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో చేస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు ఇప్పుడు సమాజానికి కొత్త సమస్యగా మారాయి. సెలబ్రెటీల మొహాలను పోర్న్ స్టార్స్‌కు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు కొందరు నీచులు. కేవలం సెలబ్రిటీలే కాదు.. కామన్ పీపుల్ కూడా ఈ డీప్ ఫేక్ కు బలవుతున్నారు.