Home » Tag » janaseana
పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటర్లు దాదాపు 91వేల మంది ఉన్నారు. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన మరో నేత కోసం వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పిఠాపురంలో పవన్‌కు చెక్ పెడితే చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లోనూ జనసేనను కంట్రోల్ చేయొచ్చన్నది వైసీపీ వ్యూహం.
ఫస్ట్ లిస్ట్‌లో 94మంది అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించగా.. 24సీట్లలో 5 స్థానాలకు క్యాండిడేట్స్ అనౌన్స్ చేసింది జనసేన. ఐతే అనంతపురం జిల్లాలో కీలక నేతగా ఉన్నా.. పరిటాల శ్రీరామ్ పేరు కూడా లిస్ట్‌లో లేకపోవడం.. ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.
ఏపీలో టీడీపీ కలలు కంటోంది. తెలంగాణలో కేసిఆర్ గెలిస్తే.. ఏపీలో జగన్ గెలుస్తాడు అని చెప్పలేరు. కానీ, కేసీఆర్ ఓడితే మాత్రం జగన్ కూడా ఓడిపోతారని అంటున్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటి..?
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. కాపు నేస్తం అనే సంక్షేమ పథకంతో ప్రజలకు లబ్ధి చేకూరేలా నిడదవోలులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభ నుంచి చంద్రబాబుపై పెద్దగా టార్గెట్ చేయకుండా కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే హైలైట్ చేశారు. దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి.. అనే అంశం పై పూర్తి వివరాలు చూద్దాం.
రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గాలు మాత్రం అధికారానికి దూరంగానే ఉన్నాయి. తెలంగాణలో బీసీలు, ఏపీలో కాపులు అధిక జనాభా కలిగి ఉన్నారు. అయినప్పటికీ అధికారం మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పటికీ రాజకీయాల్ని శాసించే స్థాయిలో మాత్రం లేరు.
వారాహి యాత్రకు భారీ స్పందన రావడం, ప్రజల మూడ్ తెలియడంతో ఇదే ఊపులో దూసుకెళ్లాలని పవన్ భావిస్తున్నారు. జనసేనను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు.
తాను పోటీ చేయబోయే స్థానం గురించి భీమవరం వేదికగానే పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాక నుంచి పోటీ చేసిన పవన్.. రెండు చోట్లా ఓడిపోయారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కుందాం అని పదేపదే అంటున్న పవన్.. భీమవరం నుంచి మళ్లీ పోటీ చేస్తారా అనే చర్చ మొదలైంది.